వార్తలు

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

0

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, మర్రి జనార్ధన్ రెడ్డి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, వీఎం అబ్రహం గారు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్లు శృతి ఒఝూ, వెంకట్రావు, శర్మన్ గార్లు
ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలి
వీలైనన్ని ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోవాలి.
మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్ లోడ్ చేయాలి.
ఆయా మిల్లులలో స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు, పక్కన ఉన్న గోదాంలకు పంపించాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.
క్రాప్ బుకింగ్ లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించవద్దు.
క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తరువాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. సరిహద్దు జిల్లాలలో అప్రమత్తంగా ఉంటే చాలు.
కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తా.
హమాలీల సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి.
తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తున్నా జిల్లాల మీద కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
మార్చి 31 లోపు పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే పంటనష్టాలు ఉండవు.
సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో రైతులను ఈ దిశగా చైతన్యం చేయాలి.
ప్రకృతి విపత్తులైన గాలివానలను, వాటి వలన జరిగే నష్టాలను మనం నివారించలేము.
కరోనా మహమ్మారి నివారణకు వైద్యసిబ్బంది కృషి అమోఘం.
కరోనా లక్షణాలుంటే చికిత్స మొదలుపెట్టాలి.
కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పనకు, వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించండి.
వేసవి నేపథ్యంలో ఎండవేడిమి కేసులు కూడా వస్తాయి.. జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటింటి జ్వర సర్వేలు ఖచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోండి.
జ్వర సర్వేల విషయంలో ప్రజలు, జ్వర పీడితుల నుండి ఎలాంటి స్పందన ఉంది ? వారు ప్రభుత్వం నుండి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారు? ఇంకా ఏం చేయాలని సూచిస్తున్నారు ?
కరోనా కేసులు హైదరాబాద్ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడాలి.
గత నాలుగు రోజుల నుండి కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించిన కలెక్టర్లు.
మరొక రెండు మాసాలు అందరం కలిసికట్టుగా కృషి చేసి దీనిని దైవ కార్యంగా భావించి మనందరం ప్రజలను ఈ విపత్తు నుండి బయటపడేద్దాం.
అయినవారే దూరం పెడుతున్న పరిస్థితులలో కరోనా విపత్తులో వైద్యసిబ్బంది, ఆశా వర్కర్ల సేవలకు చేతులెత్తిమొక్కాలి.
ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు,ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ గారు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, మర్రి జనార్ధన్ రెడ్డి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, వీఎం అబ్రహం గారు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్లు శృతి ఒఝూ, వెంకట్రావు, శర్మన్ గార్లు , డీఎం & హెచ్ ఓ లు శ్రీనివాసులు, చందునాయక్, సుధాకర్ లాల్ తదితరులు

Leave Your Comments

తలకంటి ఫామ్స్ పేరిట వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

Previous article

పశువులపై సాధారణముగా క్షేత్రస్థాయిలో రైతులు అడుగుతున్న ప్రశ్నలు – జవాబులు

Next article

You may also like