13 ఏళ్ళు పనిచేయించుకొని కరోనా మొదటివేవ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ జీతాలు ఇవ్వలేమని ఉద్యోగం నుంచి తీసేసింది. తనకొచ్చిన డ్రైవింగ్ తో కుటుంబాన్ని పోషించుకుంటానని రూ. లక్ష అప్పు చేసి ఆటో కొనుగోలు చేసాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆటోల్లో ఎవరు ఎక్కకపోవడంతో డీజిల్ ఖర్చులు కూడా రాలేదు. అధైర్య పడకుండా సాగు రంగంవైపు దృష్టిసారించాడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన పెసర శ్రీనివాస్.
సుందరగిరి గ్రామానికి చెందిన పెసర శ్రీనివాస్ కు భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు వున్నారు . భార్య కూలి పని చేస్తుండగా .. పిల్లలు 9,10వ తరగతి చదువుతున్నారు. కుటుంబ పోషణ కోసం 13 ఏళ్లుగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో అవుట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసాడు. రోజుకి 12 గంటల డ్యూటీ చేయగా రూ. 9,500 జీతం వచ్చేది. వచ్చిన జీతం సరిపోయేది కాదు. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, కరోనా లాక్ డౌన్ తో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది . సంస్థలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసివేయడం ప్రారంభించింది ఆర్టీసీ. ఈ క్రమంలో శ్రీనివాస్ తో పాటు మరికొందరు సెక్యూరిటీ గార్డులను ఉద్యోగానికి రావొద్దని చెప్పారు. దీంతో కుంటుంబ పోషణ కోసం శ్రీనివాస్ రూ. లక్ష అప్పుచేసి సెకండ్ హ్యాండ్ లో ఆటో కొనుగోలు చేశాడు. రెండు నెలల పాటు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ నడిపించాడు. జనాలు కరోనా భయంతో ఎక్కకపోవడంతో డీజిల్ ఖర్చులు దీంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నాడు. వివిధ రకాల కూరగాయలు సాగు చేయడం ప్రారంభించాడు. వచ్చిన పంటను తన ఆటోలో తీసుకుని పోయి వివిధ గ్రామాల్లో, వారసంతల్లో అమ్మడం ప్రారంభించాడు. దాదాపు ఏడాది కాలంగా ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. వచ్చిన ఆదాయంతో అప్పులు తీరాయని, ఇల్లు గడుస్తోందని తన భార్య కూడా కూరగాయల సాగులో భాగస్వామ్యం అవుతోందని శ్రీనివాస్ చెబుతున్నాడు. చేయాలనే సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని శ్రీనివాస్ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగం పోవడంతో కూరగాయల సాగు చేస్తున్న శ్రీనివాస్..
Leave Your Comments