వార్తలు

PJTSAU లో డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్

0

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయము వివిధ డిప్లమో కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్ అక్టోబర్ 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు  విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ యస్.సుధీర్ కుమార్ (Sudheer Kumar) గారు తెలియజేశారు. రెండు విడతల కౌన్సిలింగ్ తరువాత ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకై స్పాట్ కౌన్సిలింగ్ కు  దరఖాస్తులందరూ హాజరు కావచ్చని రిజిస్ట్రార్ గారు తెలిపారు  మరియు ఈ స్పాట్ కౌన్సిలింగ్ లో  సీట్ల కేటాయింపు రిజర్వేషన్ నిబంధనల ప్రకారముగా  జరుపబడునని రిజిస్ట్రార్ గారు తెలిపారు. ఇదివరకే సీట్లు లభ్యమైన అభ్యర్థులు వెంటనే నిర్ణీత ఫీజును  చెల్లించి కాలేజీలో జాయిన్ అవ్వగలరని రిజిస్ట్రార్ తెలిపారు.

పూర్తి వివరాలు అంటే సీట్ల ఖాళీల వివరాలు మరియు మొదలగు సమగ్ర సమాచారము కొరకు విద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in చూడగలరు.

Leave Your Comments

ఏపీ రైతులకు శుభవార్త : ఇక వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థ – ఆర్బీకేలు (RBK) పగలంతా తెరిచుండేలా

Previous article

వరి విత్తనాలు అమ్మితే ఖబడ్దార్ – సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి

Next article

You may also like