Yarsagumba: హిమాలయాల్లో మాత్రమే లభించే అద్భుత వనమూలిక యర్సాగుంబ. ఒక కిలో యర్సాగుంబ 60 లక్షల పైగానే ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యర్సాగుంబని న్యాచురల్ వయాగ్రా అని కూడా అంటారు. అయితే అంతకుమించిన ఆరోగ్య లక్షణాలు యర్సాగుంబలో ఉన్నాయని అంటున్నారు. ఈ యర్సాగుంబని సేకరించడం కోసం నేపాల్ లో ప్రాణాలను సైతం లెక్కచేయరు.
గొంగళి పురుగు లాంటి ఓ పురుగు లార్వా తలమీద పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగసే ఈ యర్సాగుంబ. శీతాకాలంలో యర్సాగుంబ పురుగులా ఉండగా వేసవి సమయానికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారుతుంది. పూర్తిగా తయారైన యర్సాగుంబ 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. కిలో యర్సాగుంబ ధర 60 లక్షలు పలుకుతుండటంతో నేపాల్ లోని మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే యర్సాగుంబ అత్యంత ఖరీదైంది కావడంతో దీనికోసం ఆ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలైతే నేపాల్ ప్రజలు ఆ యర్సాగుంబ కోసం పరుగులు తీస్తారు. నెలరోజుల పాటు బంగారం కన్నా విలువైన యర్సాగుంబ కోసం చిన్న, పెద్ద అందరూ వేట సాగిస్తారు. పసుపు రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. వయాగ్రా లక్షణాలు ఉండటంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలికా సొంతం.
Also Read: వనమూలికల ఔషధంతో చీడపురుగులకు చెక్
యర్సాగుంబ సేకరించేవారి కోసం ప్రభుత్వాలు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. మార్గమధ్యలో ఏదైనా ప్రమాదాలు జరిగితే వారికి హెల్త్ క్యాంపుల్లో చికిత్స అందిస్తారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్ కు 6 వందల కిలో మీటర్ల దూరంలో ఉండే డోప్ల జిల్లాలో యర్సాగుంబ సేకరణ దారులు ఎక్కువగా ఉంటారు. యర్సాగుంబ సేకరణ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు వదిలారు.
1000 ఏళ్ళ క్రితం యర్సాగుంబ ఆనవాళ్లను చైనాలోని పశుపోషకులు వెలుగులోకి తెచ్చినట్లు కథనాలు వచ్చాయి. యర్సాగుంబను అక్కడి రైతులు పశు దాణాగా ఉపయోగించవారట. అయితే దాన్ని పశువులు ఆరోగ్యంగా, చురుకుగా పనిచేసేవట. ఈ మూలికల్లో ఉండే ప్రత్యేకత వల్లే పశువులు చురుకుగా ఉండేవని అప్పట్లోనే గుర్తించారు. ఇక 1960 నాటి కాలంలో యర్సాగుంబను టీ, సూప్ లలోను వాడేవారు. 1990లలో ఓ చైనీస్ రన్నర్ రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడంలో యర్సాగుంబ అతనికి సహాయపడింది. యర్సాగుంబ ఇచ్చిన శక్తి కారణంగానే అతనికి ఆ ఫీట్ సాధ్యమైనట్టు ప్రచారం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యర్సాగుంబకు గుర్తింపు లభించింది. ఇది కీళ్లనొప్పులు, ఉభయకాయం, క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేయడానికి పని చేస్తుంది.
Also Read: పల్లేరు చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..