SKM Forms Committee for Dialogue with Govt వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులు, రైతులపై కేసుల ఉపసంహరణ సహా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చల కోసం సంయుక్త కిసాన్ మోర్చా శనివారం ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రైతు నాయకులు బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చదుని మరియు యుధ్వీర్ సింగ్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు, ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించేందుకు మోర్చా తదుపరి సమావేశం డిసెంబర్ 7న ఉదయం 11 గంటలకు జరుగుతుందని రాకేష్ టికాయత్ (Rakesh Tikait) తెలిపారు.
సమావేశం అనంతరం ఎస్‌కెఎం నాయకులు మాట్లాడుతూ.. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునే వరకు ఇక్కడి సింగు సరిహద్దు నుంచి కదిలేది లేదని, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వివిధ రాష్ట్రాల్లో ఎవరు చర్చలు జరపాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైతు నాయకుడు, ఎస్‌కెఎం సభ్యుడు అశోక్ ధావ్లే మాట్లాడుతూ అమరులైన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, రైతులపై పెట్టిన తప్పుడు కేసులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై సమావేశంలో చర్చించామన్నారు. Samyuktha Kisan Morcha
3 Farm Laws సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పటికకీ .. ఎంఎస్‌పిపై చట్టపరమైన హామీ, ఉద్యమ సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, కేసుల ఉపసంహరణ వంటి ఇతర డిమాండ్‌లపై ఆందోళనకారులు ఒత్తిడి చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.