వార్తలు

రైతు సంఘం మోర్చా ఎత్తివేత?

0
SKM

SKM Accepts Centre Proposal కేంద్ర ప్రభుత్వంతో సంయుక్త కిసాన్ మోర్చా చర్చలు సఫలీకృతం అయ్యాయని మోర్చా సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగా ముసాయిదా ప్రతిపాదనను ఆమోదించేందుకు ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు మోర్చా ప్రకటించింది. అయితే చర్చలు ఫలించినప్పటికీ రాతపూర్వక సమాచారం కోసం వేచి చూస్తున్నామని రైతు సంఘాల కీలక నేతలు తెలిపారు. కాగా నేడు మరోసారి సమావేశమై మోర్చాలను ఎత్తివేసేందుకు అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్టు రైతు సంఘాల గొడుగు సంఘం పేర్కొంది.
SKM

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమానికి సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సాగు చట్టాలను రద్దు చేయడమే కాకుండా రైతుల పెండింగ్‌ డిమాండ్‌లపై మోర్చా పోరాటం చేస్తుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు గత ఏడాది నవంబర్ 26 నుంచి దేశ రాజధాని సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. అయితే నవంబర్ 29న నిరసన తెలుపుతున్న రైతుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటులో బిల్లు ఆమోదించింది కేంద్రం. SKM Accepts Centre Proposal

SKM

Farmers Demands ఇక రైతు డిమాండ్లలో ఎంఎస్‌పిపై చట్టపరమైన హామీ, నిరసన తెలిపిన రైతులపై కేసుల ఉపసంహరణ మరియు ఉద్యమ సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం లాంటివి ఉన్నాయి. అయితే ఇదే అంశం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. SKM

Leave Your Comments

బీహార్‌లో ఎరువుల కొరతతో రైతుల నిరసనలు..

Previous article

ఆదర్శ మహిళ రైతు కథ..

Next article

You may also like