Sirivennela Seetharama Sastry passes away ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ నేడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. PM Modi Condoles Demise Of Sirivennela Seetharama Sastry
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 3000 కు పైగా పాటలకు తనదైన శైలిలో, మనస్సును హత్తుకునే రీతిలో సాహిత్యాన్ని అందించి, 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందిన పద్మశ్రీ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం చాలా బాధాకరం.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ కేంద్ర హోమ్ మినిష్టర్ అమిత్ షా ట్వీట్ చేశారు. Centre Minister Amit Shah Condoles Demise Of Sirivennela Seetharama Sastry
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సీఎం వైస్ జగన్ ట్వీట్ చేశారు. CM YS Jagan Condoles Demise Of Sirivennela Seetharama Sastry
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు. CM KCR Condoles Demise Of Sirivennela Seetharama Sastry
అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. Chandrababu Naidu Condoles Demise Of Sirivennela Seetharama Sastry
తన పాటల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. Minister KTR Condoles Demise Of Sirivennela Seetharama Sastry
మూడున్నర దశాబ్దాల పాటు మూడు వేలకు పైగా పాటలు రాసి తెలుగు సినిమాపాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. Minister Niranjan Reddy Condoles Demise Of Sirivennela Seetharama Sastry