వార్తలు

అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుఫాన్..

0

గులాబ్ తుఫాన్ ధాటికి వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఈ తుఫాన్ సృష్టించిన కల్లోలం ఇంకా కళ్ళ ముందే మెదులుతుంది. వస్తున్న తుఫాన్ ఎలాంటి బీభత్సము సృష్టిస్తుందోనని భయపడిపోతున్నారు. అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ఏర్పడింది. దీనికి షహీన్ అని పేరు పెట్టారు. మొత్తం ఏడు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాన్ మధ్య అరేబియా తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. తర్వాత తీవ్ర తుఫాన్ గా మారనుంది.

Leave Your Comments

కలోంజీ పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

మిశ్రమ సాగుతో అధిక ఆదాయం పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

Next article

You may also like