Rythu Bandhu From Tomorrow తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. రైతుబంధు పథకం నిధుల జమకు తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం సొమ్ము జమకానుంది. ఒకరం భూమి ఉన్న రైతులకు మొదటి రోజు, రెండు ఎకరాలు ఉన్న రైతులకు రెండో రోజు ఇలా విడతల వారీగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమకానున్నాయి.అయితే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రైతుబంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్య, నగదు మొత్తం కూడా పెరగనున్నట్లు తెలుస్తుంది. గత జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాలంలో 61లక్షల 8వేల మందికి 7వేల 377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించింది ప్రభుత్వం. వచ్చే యాసంగి సీజన్‌కోసం లబ్ధిదారుల సంఖ్య 66లక్షల 56 వేలకు పెరిగింది. దీంతో వారికి 7వేల 600 కోట్ల పైగా సాయం అందనుంది. Farmers Will Get Rythu Bandhu From Tomorrow
సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో రూ.300కోట్ల మేర అదనంగా రైతుబంధు సాయం అందించనుంది ప్రభుత్వం. అటు రైతుబంధు చెల్లింపుల కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థికశాఖ సమకూర్చుకుంటోంది. ఖజానాకు వచ్చే ఆదాయంతో పాటు రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తాన్ని ఇందుకు వినియోగించనుంది. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 3వేల 500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… మరో 2వేల కోట్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. రేపు ఈ బాండ్ల విక్రయంతో రెండు వేల కోట్ల మొత్తం సమకూరనుంది.
Good News For Farmers రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.7,600 కోట్లతో సర్దుబాటు చేశారు. అందులో భాగంగా రేపటి నుంచి. ఈ నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నకు ఆసరాగా నిలిచే రైతు బంధు చెల్లింపులు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Rythubandhu Status