వార్తలు

రేపటి నుంచి రైతు ఖాతాలోకి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి

0
Palm Oil Samit

cm kcr

Rythu Bandhu ఈ నెల 28 నుండి యాసంగి రైతుబంధు Rythu Bandhu నిధులు పంపిణీ జరుగుతుందని అన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. 10 వ తేదీ డిసెంబరు నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు మరియు కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులుకు ఈ పథకం వర్తిస్తుంది. Minister Niranjan Reddy

Minister Niranjan Reddy 

ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్లు జమ కానున్నాయి. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులుగా ఉన్నారని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో నిధులు జమ అవుతాయి. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా రోమ్ లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులోఎఫ్ ఎ ఓ గుర్తించిందని గుర్తు చేశారు మంత్రి. Rythubandhu Scheme

Leave Your Comments

Pusa Bio Decomposer: పొట్టును కాల్చే కాలుష్యానికి పరిష్కారం

Previous article

Dry Fodder: ఎండుగడ్డి తయారీలో మెలకువలు

Next article

You may also like