వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో సాగు..

0

ఈ సంవత్సరం జర్రంత కాలం మంచిగైందిరా..  బావిలో నీళ్లు మెల్లగా ఎక్కుతున్నాయి.. ఓ ఎకరం పొలం ఎక్కువ పారెటట్లు ఉంది.  ఆ ఎకరం పొలం పారితే ఇంత అప్పైనా తీరుతుంది ఇదీ తెలంగాణ ఏర్పడకముందు రైతు గోసకు సజీవ సాక్ష్యం. ఒక్క ఎకరం భూమి ఎక్కువ సాగు కావాలంటే ఆ దేవుడు కరుణించాలె.. అది ఎప్పుడో కానీ కలుగని అదృష్టం. కానీ, ఇప్పుడు తెలంగాణ రైతులకు నిత్యం వెన్నంటే అదృష్టం ఉంటున్నది. ఎకరం పొలం అధికంగా పారేందుకు ఆపసోపాలు పడ్డ తెలంగాణ రైతన్న.. ఇప్పుడు సునాయాసంగా పదుల ఎకరాల్లో సాగును పెంచి ఎవుసాన్ని పండుగ చేస్తున్నాడు. దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా సరే.. కనీసం లక్ష ఎకరాల సాగు పెంచేందుకు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. లక్ష ఎకరాల సాగు పెరిగితే ఎలా ఉంటుంది.. దాన్ని ఏమనాలి .. ఏమని అభివర్ణించాలి..  ఈ అద్భుతం తెలంగాణకే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సాగైన భూమిని పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.  రాష్ట్రంలో సాగు భూమి పెంపునకు కాళేశ్వరం, మిషన్ కాకతీయ సహా రైతుబంధు, సబ్సిడీ ఎరువులు, విత్తన పంపిణీ ప్రభుత్వం ఎంతో అధికంగా సాయం చేస్తున్నది.

దేశంలో మరే రాష్ట్రంలో సాధ్యంకాని విధంగా తెలంగాణలో రికార్డుస్థాయిలో సాగు పెరుగుతున్నది. దాదాపుగా వ్యవసాయ భూమిలో ప్రతి ఇంచూ సాగు అవుతుండడం గమనార్హం.  తెలంగాణలో ఇటీవల లెక్కల ప్రకారం 62.27 లక్షల మంది రైతుంటే వీరి వద్ద సుమారుగా 1.52 కోట్ల ఎకరాల భూమి ఉంది. రాష్ట్రాం ఏర్పడిన తొలినాళ్లలో బతుకు జీవుడా అంటూ ఎవుసం ఎల్లదీసిన రైతులు.. నేడు సగర్వంగా సాగు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయిన ఏడాదినుంచి ఈ సీజన్ వరకు ఏకంగా 64 లక్షల ఎకరాలకుపైగా సాగు పెరిగింది. రాష్ట్ర వ్యవసాయరంగం రూపురేఖలు కేవలం మూడేండ్ల లోనే మారిపోవడం గమనార్హం.  2015 – 16 వరకు సాధారణంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయం 2016 – 17 నుంచి ఊపందుకున్నది. ఆ సంవత్సరం నుంచే సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని సుసంపన్నం చేసేలా పలు కీలకమైన పథకాలకు నాంది పలికారు. దీంతో ఏటా సాగు భారీగా పెరిగింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 నవంబర్ నుంచి 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. క్రమంగా 2015 మార్చిలో మిషన్ కాకతీయ, 2016 జూన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు, 2018 మే నుంచి రైతుబంధు పథకం ఇలా ఒకదాని తర్వాత మరో పథకం అమలు చేసి వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చారు. ఈ పథకాలకు అందించి మరింత చేయూత నిచ్చారు. దీంతో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయి .. సాగులో రికార్డులు తిరగరాస్తున్నది.

Leave Your Comments

వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న.. ప్రభుత్వ ఉద్యోగి

Previous article

అరటిలో బోరాన్ ధాతు లోపం – నివారణ

Next article

You may also like