వార్తలు

సాగు చట్టాల రద్దుపై టికాయత్ రియాక్షన్ ఇది!

0
rakesh tikait

farmers protest

Rakesh Tikait దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రారంభమైన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. దీంతో ఈ బిల్లు రద్దుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కాగా సాగు చట్టాలపై చర్చ జరపకుండా ఎలా రద్దు చేస్తారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఎంతో వివాదాస్పదంగా మారిన సాగు చట్టాల బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేశారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది.

narendra sing tomar

parliament winter session 2021 సాగు చట్టాలపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. దేశవ్యాప్తంగా సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 40 రైతు సంఘాలు ఏకమై ఏడాది పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేపట్టాయి. దీంతో కేంద్రం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేసింది. ఈ మేరకు నేడు పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కాగా సాగు చట్టాల రద్దుపై బికేయు నేత రాకేష్ టికాయత్ స్పందించారు. లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళి తెలిపిన టికాయత్ పంటల మద్దతు ధరకు చట్టబద్దత సహా ఇతర సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతు ఉద్యమం ఆగదని అయన స్పష్టం చేశారు. రైతు సమస్యలకు పరిష్కారం చూపించేవరకు రైతు ఉద్యమం కొనసాగుతుందన్నారు టికాయత్. Rakesh Tikait

rakesh tikait

ఇకపోతే తెలంగాణ యాసంగి వరి ధాన్యం సేకరణపై లోక్‌స‌భ‌లో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలియజేశారు. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న చేప‌ట్టారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ.. ధాన్యం కొనుగోలుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్ప‌ష్టత ఇవ్వాల‌ని నినాదాలు చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. Paddy Procurement

TRS MPs Protest In Parliament Winter Session

Leave Your Comments

ధాన్యం సేకరణపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ సమర శంఖం…

Previous article

కోర్టుకెక్కిన వరి…

Next article

You may also like