వార్తలు

ఏపీలో భారీగా పంట నష్టం…

0
Rains damaged crops in lakh acres in AP
Rains damaged crops in lakh acres in AP

Rains damaged crops in lakh acres in AP. ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వారం రోజులుగా కుండపోతతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల కారణంగా ఏపీలో వేలాది ఎకరాలు నీటమునిగాయి. నెలలు కాలంగా పండించిన పంట నీళ్ల పాలైంది. ఖరీఫ్‌లో భారీగా వరి సాగయితే ఉత్పత్తి దండిగా ఉంటుందని.. కొద్దిరోజుల్లో పంట చేతికొస్తుందని అంతా భావించారు. అకాల వర్షాలతో ఊహించని నష్టం రైతును ముంచేసింది. కోతలు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వాతావరణ మార్పులతో కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది. Rains damaged crops

Rains damaged crops in lakh acres in AP

Rains damaged crops in lakh acres in AP

ముఖ్యంగా తూర్పగోదావరి జిల్లాలో దాదాపుగా 40 మండలాలపై ఈ ప్రభావం చూపించింది. కోనసీమలో 16 మండలాలు.. మెట్టలో రాజానగరం, సీతానగరం, గండేపల్లి మండలాలు విలవిల్లాడాయి. పది రోజులకుపైగా వాన నీటిలో పంట నానడంతో మొలకలు వచ్చి.. కుళ్లిపోతోంది. కోనసీమలో 90 వేల ఎకరాల్లో వరి సాగైతే.. మూడొంతులు దెబ్బతింది. ఆరుగాలం పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి వానదేవుడు అంతా ఊడ్చిపెట్టేశాడని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వ్యవసాయ పంటలు 1. లక్షా 79వేల ఎకరాలు ఉండగా.. ఉద్యాన పంటలు 23 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. Rains damaged crops in lakh acres in AP

Rains damaged crops in lakh acres in AP

Rains damaged crops in lakh acres in AP

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎంత మేర పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. కాగా భారీ నష్టం వాటిల్లడంతో పంట నష్టం అంచనా వేయడానికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.

CM YS Jagan Aerial Survey of Flood Hit Region

CM YS Jagan Aerial Survey of Flood Hit Region

Leave Your Comments

క్వినొవా సాగులో మెళకువలు

Previous article

వరి ధాన్యం కొనుగోలుపై హస్తినలో సీఎం …

Next article

You may also like