వాయుగుండం బంగాళాఖాతంలో అండమాన్ దీవులకి సమీపంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5 – 7 మధ్య వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రాలో రానున్న 2 రోజులపాటు తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమ గాలుల కారణంగా పశ్చిమ హిమాలయాల్లో రానున్న 3 రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అలాగే రాజస్థాన్ లో ఏప్రిల్ 5 – 7 మధ్య ధూళి తుఫాన్లకు ఆస్కారం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Leave Your Comments