వార్తలు

ఆ రైతుల డేటా నా దగ్గర ఉంది !

0
rahul gandhi

rahul gandhi

Rahul Gandhi slams Centre for saying ‘no record’ of farmers death కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యాయి. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతులు అడ్డం తిరిగారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాల్సిందిగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా 40 రైతు సంఘాలతో అలుపెరగని పోరాటం చేశారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేశారు. దాదాపు ఏడాది పాటు జరిగిన రైతుల పోరాటంలో 750 మంది రైతులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. కాగా.. రైతుల పోరాటానికి కేంద్రం దిగొచ్చి, మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు.

modi

ఇక తాజాగా మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో వివాదాస్పదంగా మారిన సాగు బిల్లును రద్దు చేశారు. అయితే ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా లోకసభలోను ఈ అంశాన్ని లేవనెత్తారు. కాగా దీనిపై కేంద్రం వింత ప్రకటన చేసింది. అసలు చనిపోయింది రైతులే అన్న గ్యారెంటీ ఏంటి అని ఎదురు ప్రశ్నించింది. ఉద్యమంలో చనిపోయింది రైతులే అన్న గ్యారెంటీ లేదు, అసలు చనిపోయినవారి డేటా కూడా మా వద్ద లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విపక్షాలు రెచ్చిపొయ్యాయి. డేటా లేదనడం రైతుల్ని అవమానపరిచినట్టే అంటూ ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. Rahul Gandhi

farmers death

3 Farm Laws సాగు చట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతుల డేటా మా వద్ద లేదన్న కేంద్రం ప్రకటనపై నేడు రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు నష్టపరిహారంపై కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్ రైతులు మరణించినట్టు రికార్డు లేదన్న ప్రకటనపై ఫైర్ అయ్యారు. రికార్డులు లేకుంటే పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. నిరసనల్లో మరణించిన రైతుల్లో 403మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయన్న రాహుల్ రైతులకు పంజాబ్ ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక అమరులైన రైతులకు ఎంత పరిహారం ఇస్తారు? సత్యాగ్రహిలపై పెట్టిన తప్పుడు కేసులు వాపస్ ఎప్పుడు తీసుకుంటారు ? మద్దతు ధరపై చట్టం ఎప్పుడు వస్తుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ.

rahul vs modi

Data Of Death Farmers ప్రధాని మోదీకి రైతుల సమస్యలు పట్టవని, ఆయనకు పారిశ్రామికవేత్తలతో స్నేహం ఉంటె చాలన్నారు రాహుల్. ఇక సాగు చట్టాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సారీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దానిపై కూడా రాహుల్ స్పందించారు. మీరు నిజంగా క్షమాపణ చెప్పాలనుకుంటే నేరుగా బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి, వారి బాధలను విని, పరిహారం ఇవ్వండని సూచించారు రాహుల్ గాంధీ. Delhi Protest

Leave Your Comments

పుట్ట గొడుగులు – పోషకాల గనులు

Previous article

ఆరోగ్యానికి ఆకుకూరలు

Next article

You may also like