వార్తలు

గ్యాగ్ పండ్ల సాగుతో లాభాలు..

0

కేరళలోని అంగమాలీలో ఉన్న అమలాపురం నివాసి జోజో. అందరిలా రొటీన్ వ్యవసాయం చేయడం మానేశాడు. కొత్తగా గ్యాగ్ పండ్ల సాగు మొదలుపెట్టాడు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే జోజో ఈ పండ్ల సాగును మరింత పెంచాలని తాజాగా డిసైడ్ అయ్యారు. ఈ గ్యాగ్ పండ్లు మలేసియా, థాయిలాండ్, వియత్నాంలో పండుతాయి. ఇండియాలో అంగమాలీ వీటి సాగు జోరందుకుంది. ఇదో రకమైన పుచ్చకాయ లాంటి పండు. దీన్ని చైనా కుకుంబర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. తియ్యగా ఉండదు. కానీ కాకరకాయ లాగానే .. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని స్పైనీ బిట్టర్ గార్డ్, రెడ్ మెలన్, బేబీ జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. గ్యాగ్ పండ్లను ఆహారంగా తింటారు. మందుల తయారీలో వాడుతారు. వియత్నాంలో అన్నంలో ఈ పండు గుజ్జు కలుపుకొని తింటారు. ఈ పండ్లు, ఆకులను కూడా వంటలో వాడుతారు. వియత్నాం ప్రజలు ఈ పండును స్వర్గానికి చెందినదిగా భావిస్తారు. ఈ పండ్ల గింజలను సేకరించిన జోజో.. వాటిని నాటితే మొక్కలు వచ్చాయి. కేరళలో వాతావరణం వీటికి బాగా సెట్ అయ్యింది. దాంతో ఈ మొక్కలు బాగా పెరిగి బోలెడన్ని పండ్లు కాశాయి. పుచ్చకాయ మొక్క ఎలాగైతే పాకుతోందో .. అదే విధంగా గ్యాగ్ పండ్ల మొక్క కూడా పాకేదే. పండు తొక్కపై కరోనా వైరస్ కి ఉన్నట్లుగా ముళ్ళు ఉంటాయి. మొదట్లో ఈ పండు గ్రీన్ కలర్ లో ఉంటుంది. తీరా పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ పండ్లు మొదట గ్రీన్ గా ఉండి.. తర్వాత పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత ఎరుపు రంగులోకి వస్తాయి. ఇలా ఎరుపు రంగు వచ్చినప్పుడు.. పండు లోపలి గుజ్జు, గింజలను తినవచ్చు. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. భోజనంలో ఈ జ్యూస్ ని కర్రీలా వాడుతారు. గ్యాగ్ పండ్లలో బీటా కెరోటిన్ ఎక్కువ. ఇది కంటి చూపును పెంచుతుంది. వియత్నాంలో పెళ్లిళ్లలో భోజనాల్లో గ్యాగ్ పండ్ల గుజ్జును కలిపి చేసిన అన్నాన్ని వడ్డిస్తారు. ఈ మొక్కల సాగు చేపట్టేవారు.. వాటిని చాలా దగ్గరగా నాటాలి. లేదంటే పండ్లు కాయపు అని చెబుతున్నారు. పుప్పొడి సేకరణ.. వ్యాప్తిని సాగు చేపట్టేవారే చెయ్యాల్సి ఉంటుంది. గింజల జెర్మినేషన్ ప్రక్రియ ద్వారా.. కొత్త విత్తనాల సేకరణ చెయ్యవచ్చు. జెర్మినేట్ అవ్వడానికి గింజలకు నెల, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. నీటిలో నానబెట్టడం ద్వారా గింజల త్వరగా విత్తనాలు అవుతాయి. ఎండ వాతావరణం ఈ మొక్కల సాగుకు బాగా పనిచేస్తుంది. ఎండ ఉన్నప్పుడే ఈ మొక్కలు నాటాలి. ఈ పండ్లకు ఉన్న మార్కెట్ ను పెంచడానికి జోజో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలోని రిలయన్స్ ఫ్రెష్ షాపులో మొదటిసారిగా ఈ పండ్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం జోజో తన ఇంటి దగ్గరే 60 సెంట్లలో ఈ సాగు చేపట్టారు. గ్యాగ్ పండ్లతో కొత్త ఉత్పత్తులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. గ్యాగ్ పండ్లతో పాటు జోజో.. చేపల చెరువు కూడా మెయింటేన్ చేస్తున్నారు.

Leave Your Comments

మార్చి 29న హైదరాబాద్ లో సేంద్రియ మేళా..

Previous article

అరటి తోటకు రక్షణగా ఓ రైతు ఏర్పాటు చేసిన కాగితపు గొడుగులు…

Next article

You may also like