వార్తలు

ఆరెంజ్ పండ్లతో విద్యుత్ ఉత్పత్తి

0

వేసవిలో చల్లని ఆరెంజ్ జ్యూస్ తాగితే మనసుకు ఎంతో హాయే కదా.. బాగా అలసిపోయినప్పుడు నారింజ పండ్ల వాసన వచ్చినా చాలు క్షణాల్లో నోట్లో నీళ్లూరుతాయి. ఈ ఆరెంజ్ లతో కరెంటునూ ఉత్పత్తి చెయ్యుచ్చంట.. తాజాగా స్పెయిన్ లోని సెవిల్లే నగరంలో దాదాపు 48 వేల నారింజపండ్లతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయోగం చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితుల రీత్యా శీతాకాలంలో నారింజ పండ్లు 16 వేల టన్నులకు పైగా కాస్తాయి. అక్కడి పారిశుద్ధ్య కార్మికులు, ఎమెసెసా, సెవిల్లే నగరానికి నీటి వసతి కల్పించే విభాగాలతో కలిసి పార్క్ డిపార్ట్ మెంట్, సిటీ కౌన్సిల్ వారు పైలట్ ప్రోగ్రాం నిర్వహించారు. నారింజ రసం తీసిన తర్వాత 38.6 టన్నుల ఆరెంజెస్ ఇంకా మిగిలిపోతున్నాయట. వాటిని పులియబెట్టి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే పులియబెట్టిన లిక్కర్ నుంచి మీథేన్ వాయువు విడుదల అవుతుంది. దాన్ని జెనరేటర్ లోకి పంపిస్తే శక్తి విడుదల అవుతుంది. అధికారుల అంచనా ప్రకారం ఇది 15 వందల కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందట. నీటి శుద్దీకరణకు కావాల్సినంత శక్తి అందుతుందట.
నారింజ పళ్ల వ్యర్థాలైనా తొక్క, పిప్పిని కూడా వదలడం లేదు.. వాటిని ఎరువులుగా వాడుతున్నారు. ఈ ప్రయోగం సఫలం అయితే 2023 నాటికి నారింజపండ్లన్నింటినీ రీసైకిల్ చేసి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తారట. తొలి ప్రయత్నంలోనే వెయ్యి కిలోల పండ్లు 50 కిలో వాట్ల శక్తినిచ్చాయి. అంటే అయిదు ఇళ్లకు సరిపడా కరెంటు అన్నమాట.. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సుమారు 73 వేల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా అందించొచ్చని అక్కడి వారు అంచనా వేస్తున్నారు.
సిట్రస్ జాతి పండ్లతో విద్యుత్తు తయారు చెయొచ్చు. వీటిలో ఉండే ఆమ్లాలు, జింక్, రాగి వంటి ఎలక్రోడ్లతో కలిసి కరెంటును పుట్టిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి బ్యాటరీల్లాగా పనిచేస్తాయి. ఇవి చిన్న చిన్న ఎల్ ఈడీ బల్బులు, డిజిటల్ గడియారాలు పనిచేసేందుకు శక్తినిస్తాయి.

Leave Your Comments

కోతుల బెడదకు విరుగుడు..పంజరపు తోట

Previous article

కూలీల కొరత, శ్రమను తగ్గించేందుకు “జవాన్ బేలర్” యంత్రం..

Next article

You may also like