వార్తలు

‘సరయు కెనాల్‌’ తో 29 లక్షల రైతులకు లబ్ది..

0
PM Modi to launches Saryu canal

PM Modi to launches Saryu canal

PM Modi to launch over ₹9,800 crore Saryu canal project ఐదు నదులను అనుసంధానిస్తూ చేపట్టిన బృహత్తర ప్రాజెక్ట్ ‘సరయు కెనాల్‌’ . ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందడమే కాకుండా ఈ కెనాల్ ద్వారా 29 లక్షల రైతులకు లబ్ది చేకూరనుంది. వివరాలలోకి వెళితే..

PM Modi to launches Saryu canal

ఉత్తరప్రదేశ్ లోని నిర్మించిన ‘సరయు కెనాల్‌’ ప్రాజెక్టు ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 1978 లోనే మొదలైన ‘సరయు కెనాల్‌’ ప్రాజెక్ట్ ఆర్ధిక లోటుతో మరుగున పడింది. కాగా ఇటీవల ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైంది. 9,800 కోట్లతో ‘సరయు కెనాల్‌’ ప్రాజెక్టు ను అత్యాధునికంగా నిర్మించారు. ఘాఘ్ర, సరయు, రప్తి, బాన్‌గంగ, రోహిణి ఇలా ఐదు నదులను అనుసంధానం చేసి ఈ జాతీయ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. కాగా.. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్ల భూములకు సాగు నీరు అందుతుంది. 6,200 గ్రామాల్లోని 29 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుంది. (29 Lakh Farmers To Be Benefitted) తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాలు-బహ్‌రిచ్, స్రవస్తి, బలరాంపూర్, గోండ, సిద్ధార్ధ్‌నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్‌లకు ప్రయోజనం చేకూరుతుంది.

PM Modi to launches Saryu canal project

saryu canal
‘సరయు కెనాల్‌’ జాతీయ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటి?  Saryu Canal specifications

* ఐదు నదులను కలుపుకుని 6,600 కిలోమీటర్ల పొడవునా ఉప కాలువలను 318కిలోమీటర్ల ప్రధాన కాలువకు అనుసంధానం చేశారు.

* తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వ వాగ్దానంలో ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన మైలురాయి.

* 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగు నీరు, 6,200 గ్రామాలకు, 29 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

* ఈ కాలువ వ్యవస్థ తూర్పు ఉత్తరప్రదేశ్‌ జిల్లాలను వరదల నుండి కూడా కాపాడుతుందని ప్రధానమంత్రి కార్యాలయం చెప్తుంది. Benefits Of Saryu Canal

Leave Your Comments

విశాఖ మన్యంలో 49 ఎకరాల్లో గంజాయి సాగు..

Previous article

హైకోర్టు మెట్లెక్కిన రైతులు..

Next article

You may also like