వార్తలువ్యవసాయ వాణిజ్యం

35 నూతన పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

0
narendra modi

narendra modiవాతావరణ మార్పుల వల్ల కొత్త వ్యాధులు ఉద్భవిస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు విస్తృత పరిశోధనలు అవసరమని శ్రీ. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రత్యేక వంగడాలతో కూడిన 35 నూతన పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాని. కొత్త వ్యాధుల వల్ల మనుషులు, పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్ర విజ్ఞానం, ప్రభుత్వం, సమాజం కలిసి పని చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని మోదీ అన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు రైతులు, శాస్త్రవేత్తల సంబంధాలు మరింత బలపడాలని సూచించారు. తగిన రక్షణ లభిస్తేనే వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు. రైతుల భూమికి రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం 11 కోట్ల భూసార కార్డులను అందజేసిందని తెలిపారు. రాబోయే 25 ఏళ్ల తర్వాత స్వాతంత్ర దినోత్సవ శతాబ్ది వేడుకలు జరగనున్న నేపథ్యంలో రాబోయే కాలంలో అనేక సంకల్పాలను నిజం చేయబోతున్నామని ప్రధాని శ్రీ .నరేంద్ర మోడీ గారు  వెల్లడించారు.

Leave Your Comments

PJTSAU లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 106వ జయంతి వేడుకలు

Previous article

PJTSAU ను సందర్శించిన శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డాక్టర్.డి .వెంకటేశ్వరన్ గారు

Next article

You may also like