వార్తలు

PM Kisan Samman Nidhi: రైతులకి గుడ్ న్యూస్.!

2
PM Kisan Samman Nidhi Updates
PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi: చిన్న రైతుల సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వారి ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులకు ఎంతో భరోసా కల్పిస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది కేంద్రం ప్రభుత్వం. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

ఇప్పటివరకు ఈపథకంలో భాగంగా 9 విడతలుగా రైతులకు నగదు జమ చేశారు. ఇక పదవ విడత డిసెంబర్ నెలలో రానుంది. నివేదికల ప్రకారం డిసెంబర్ 15న రైతులు పదవ విడత డబ్బులు అందుకోనున్నారు. తాజాగా ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.6 వేలకు బదులుగా రూ.12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు జమకానున్నాయి.

Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈ ఆర్థిక సంవత్సరం (2020-2021)లో ఏప్రిల్-జులై మధ్య కాలానికి మొదటి విడత నిధులు ఇవ్వగా… ఆగస్ట్ నుంచి నవంబర్ నాటికి రెండో విడత నిధులు ఇచ్చారు. మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుంది. ఈ నిధులు డిసెంబర్‌లో వచ్చాయి. ఇప్పటివరకూ ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 11.17 కోట్ల మంది రైతులకు… రూ.95 కోట్లను విడుదల చేసింది. మరిన్ని వివరాలు మరియు సమాచారం కోసం, పిఎం-కిసాన్ పథకం కింద రైతు-లబ్ధిదారులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో pmkisan.gov.in ని లాగిన్ అవ్వవచ్చు.

Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగ లో విత్తనశుద్ధి తో తెగుళ్ళ కు చెక్

Leave Your Comments

పంటనష్టం పై సీఎం జగన్ ఏరియల్ సర్వే…

Previous article

Eruvaaka Agriculture Magazine November-2021

Next article

You may also like