PJTSAU Memorandum Understanding with SMC ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో అంతర్జా తీయ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. మొక్కల ఆరోగ్యం, పంటల రక్షణ, ప్రెసిషన్ వ్యవసాయంలో వినూత్న పరిష్కారాలు చూపుతున్న ఎస్ఎంసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో పికెటిఎన్జీయు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై పిజెబిఎస్ఎయు ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు, ఎఎంసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి అన్నవరపు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి సాధనలో ఎదురయ్యే సవాళ్ళకి సంబంధించిన పరిశోధనల ప్రోత్సాహం కోసం పీజి, పిహెచ్డ్ విద్యార్థులకి “సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం” ద్వారా ఎస్ఎంసి ప్రోత్సాహకాలు అందించనుంది.
SMC India Private Limited జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్ళకి అనువైన టెక్నాలజీలని అందించడంలో ఎఎంసి చేస్తున్న కృషిని ప్రవీణ్ రావు అభినందించారు. ప్రాజెక్ట్ సఫల్, ప్రాజెక్ట్ సమర్ట్ వంటి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరు, ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ఎఎంసి కృషి చేస్తుందని ప్రవీణ్ రావు అన్నారు. అదేవిధంగా యువతలో సైన్స పట్ల చైతన్యాన్ని పెంచడానికి ఎస్ఎంసి పని చేస్తుం దన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లో టాలెంట్ ని ప్రోత్సహించడానికి సైన్స్ లీడర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా పీజి స్కాలర్‌షిప్స్, ఇంటెర్న్ షిప్స్, రీసెర్చ్ మెంటషిన్లని ఎస్ఎంసి అందించడం అభినందనీయం అని ప్రవీణ్ రావు అన్నారు. తెలంగాణలో తమ వర్సిటీ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఎస్ఎంసితో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రవీణ్ రావు అన్నారు. ప్రెసిషన్ వ్యవసాయం , అగ్రిటెక్ వెంచర్ క్యాపిటల్, సస్టైనబుల్ పెస్ట్ మేనేజ్ మెంట్ సొల్యూషన్స్, రైతులతో సంప్రతింపులు తదితర అంశాల్లో కలిసి పనిచేయడానికి రెండు సంస్థలు అంగీకరించాయి. ఈ సందర్భంగా బోధన, పరిశోధన, విస్తరణ అంశాల్లో భవిష్యత్తులో కలిసి పనిచేయడం పై వర్సిటీ అధికారులు, ఎఎంసి ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. PJTSAU with SMC