PJTSAU Agribiotech Foundation: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వావిద్యాలయం, అగ్రిబయోటెక్ ఫౌండేషన్ ల మధ్య నేడు అవగాహనా ఒప్పందం కుదిరింది. పి జె టీ ఎస్ ఏ యు ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు సమక్షంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్, అగ్రి బయోటెక్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి. విష్ణు వర్ధన్ రెడ్డిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.

PJTSAU
Also Read: ప్రతికూల వాతావరణం నిరాశలో మామిడి రైతులు
విద్య, పరిశోధన రంగాల్లో కలిసి పని చేయాలని ఈ సమావేశం లో నిర్ణయించారు. వర్సిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రవీణ్ రావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్క్రితం అవుతున్న నూతన టెక్నాలజీలని తెలంగాణ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావటానికి వర్సిటీ నిరంతరం క్రషి చేస్తున్నదని ప్రవీణ్ రావు అన్నారు. ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

PJTSAU Agribiotech Foundation
Also Read: రైతులు అధైర్యపడొద్దు -మంత్రి నిరంజన్ రెడ్డి