సమావేశాలకు కట్టిన జెండాలు కావు. అరటి తోటకు రక్షణగా ఓ రైతు ఏర్పాటు చేసిన కాగితపు గొడుగులు. వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం రామలింగాయపల్లికి చెందిన షేక్ నజీర్ పంటను రక్షించుకునేందుకు ఈ ఏర్పాటు చేశాడు. నాలుగెకరాలు కౌలుకు తీసుకున్న నజీర్, అందులో ఐదు వేల అరటి మొక్కలు నాటాడు. ఎండలకు మొక్కలు దెబ్బతినకుండా ఒక్కో అరటి మొక్కకు ఒక్కో పేపరును గొడుగులా అమర్చాడు. అవి గాలికి ఎగిరిపోకుండా ఇరువైపులా మట్టిగడ్డలు పెట్టాడు.
Leave Your Comments