వార్తలు

PJTSAU లో AG డిప్లొమా కోర్సులకు కౌన్సిలింగ్ ప్రారంభం

0

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తోన్న రెండేళ్ళ వ్యవసాయ, మూడేళ్ళ అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న కౌన్సిలింగ్ ను రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ ప్రారంభించారు. పాలిసెట్ 11 ర్యాంకు పొందిన శ్రీనివాస్, 61 ర్యాంకు పొందిన ప్రియాంక, పాలెం, వ్యవసాయ పాలిటెక్నిక్ లో ప్రవేశం పొందారు. అలాగే 111 ర్యాంకు పొందిన లహరి సంగారెడ్డి లోని 3  ఏళ్ల వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లో ప్రవేశం పొందింది. ఆయా అభ్యర్ధులకు రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, డైరెక్టర్ పాలిటెక్నిక్ డాక్టర్ పద్మజ, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రవేశ పత్రాలను అభ్యర్ధులకు అందజేసి కౌన్సిలింగ్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల (సెప్టెంబర్) 25 వరకు కౌన్సిలింగ్ కొనసాగనుంది.

Leave Your Comments

పి జె టి ఎస్ ఏ యు (PJTSAU) తో ఆసియన్ రూరల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్  (AARDO) ఒప్పందం

Previous article

తెలంగాణ సర్కారు వారి “తృణధాన్యాహారం”

Next article

You may also like