ఆరోగ్యానికి పరమ ఔషధం ఆహారమే. మనం నిత్యం వినియోగించే ధాన్యం, కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు, నూనెలలో రసాయన అవశేషాలు ఉంటే ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే రసాయనరహితమే మన హితం కావాలి. ఇదే నినాదంతో రైతునేస్తం, రైతు నేస్తం ఫౌండేషన్, కర్షక సేవా కేంద్రం సంయుక్త నిర్వహణలో 2021 మార్చి 29, 30, 31 తేదీలలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సహజ, సేంద్రియ ఆహార పదార్థాల ఉత్పత్తి దారులు, సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు అనుసంధానంతో ఉత్సవాన్ని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కలిసి నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సహజ, సేంద్రియ ఉత్పత్తులు 60కి పైగా స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గం. నుంచి రాత్రి 8 గం. వరకు సహజ, సేంద్రియ ప్రదర్శన, అమ్మకం ఉంటుంది. ఈ సేంద్రియ మేళాకు అనేక మంది ప్రముఖలు పాల్గొంటారు. వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సేంద్రియ మేళాను నిర్వహిస్తున్నారు.