Noida International Airport Will Develop Agriculture Sector దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. రూ.10,500 కోట్లతో మొదటి దశ విమానాశ్రయ నిర్మాణం మొదలు కానుంది. ఈ ప్రాజెక్టు అన్ని దశలు పూర్తిచేసుకునే సరికి రూ. 35 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నోయిడా నుంచి 40 కి.మీ.ల దూరంలో, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 72 కి.మీ.ల దూరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న నోయిడా ఎయిర్‌పోర్టును 2024 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా… నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల ఉత్తరప్రదేశ్ వంటి భూ-పరివేష్టిత రాష్ట్రాల పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఇప్పుడు యాత్రికులు ఆలయాలకు సులభంగా ప్రయాణించగలుగుతారని అన్నారు. అదేవిధంగా పశ్చిమ యూపీ యొక్క వ్యవసాయ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మరియు చిన్న రైతులకు సులభంగా, సమర్ధవంతంగా తక్షణమే వస్తువులను ఎగుమతి చేయడంలో సహాయపడుతుంది అని అన్నారు ప్రధాని మోడీ. Modi