no data on farmers who died says centre కేంద్ర ప్రభుత్వం రైతు సాగు చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతు స్వేచ్చకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని, రైతు హక్కులను కాలరాసే విధాంగా ఉన్నాయని రైతులు ఆ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో 40 రైతు సంఘాలు ఉద్యమానికి పిలుపినిచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ వెలది మంది రైతులు రోడ్లెక్కారు. దాదాపుగా ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణించారు. మరికొందరు రైతులకి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఉద్యమంలో శృతిమించిన రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా.. ఏడాది తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆ చట్టాలను పార్లమెంటులో రద్దు చేసినట్లు కేంద్రం పేర్కొంది.
Narendra Singh Thomar అయితే రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోకసభలో నేడు ఆ అంశాన్ని లేవనెత్తిన విపక్షాలకు కేంద్రం స్పందించింది. రైతు మరణాల పట్ల చాలా విచిత్రమైన ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. రైతు ఉద్యమంలో చనిపోయినవారికి సాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల గురించి ఎలాంటి సమాచారం లేదు, అలాంటప్పుడు సహాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రైతులను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిరసన తెలపమన్నారని, అన్ని రోజులు నిరసన తెలపమని ప్రేరేపించిన వాళ్లు నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదని కేంద్రం ఎదురు ప్రశ్నిస్తోంది. Parliament Session 2021