No clarity on paddy procurement by Centre వరి కొనుగోలు అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదరడం లేదు. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం మాత్రం నసేమిరా అంటుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి దిగారు. అందులో భాగంగా కేంద్రాన్ని ఒప్పించేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనకు యావత్ రాష్ట్ర యంత్రాంగం కదిలింది.
Paddy Procurement యాసంగి వరి కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ బృందం సంబంధిత మంత్రులతో భేటీలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో విడివిడిగా మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అధికార బృందం.. రాష్ట్ర రైతాంగం, వడ్ల కొనుగోలు అంశంపై చర్చించింది. రాష్ట్రంలో ఇప్పటికే సాగు అయిన వానకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంపై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై వివరించింది.
TRS Delhi Tour ఢిల్లీ పర్యటనలో ఉన్న నేతలకు కేంద్రం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్ర మంత్రులు వైఖరి ఒకే తాటిపై నడుస్తుంది. తెరాస కీలక నేతలు పలు అంశాలపై చర్చించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ముగ్గురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు, పది మంది ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, పౌరసరఫరాల కార్యదర్శులు ఇలా కీలక యంత్రాంగం కదిలినప్పటికీ కేంద్రం వైఖరి విషయంలో మార్పు కనిపించడం లేదు. అందులో భాగంగా కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనేలేదు. యాసంగిలో వడ్లను కొనేది లేదని కేంద్రం కరాఖండిగా తేల్చి చెప్పింది. వానకాలం వరి ధాన్యాన్ని ఎంత కొంటామనే విషయంపైనా నాన్చివేత ధోరణినే కొనసాగించింది. యాసంగిలో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కరాఖండిగా తేల్చిచెప్పిన కేంద్రం.
KTR And Team Meet With Centre Ministers తెరాస నేతల ఢిల్లీ పర్యటనలో కేంద్రం వద్ద ఉంచిన ప్రతిపాదనలపై స్పష్టమైన సమాధానం దొరక్కపోగా.. తిరిగి 26న మరోసారి సమావేశం అవుదామని కేంద్రం చెప్పింది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు టీఆర్‌ఎస్ పార్లమెంటరీపార్టీ నేత ఎంపీ కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, గడ్డం రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్‌రావుతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.