NITI Aayog VC RajivKumar Visits Veerapanenigudem ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మరియు అభివృద్ధి పనులను పరిశీలించింది నీతి ఆయోగ్. బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరిన నీతి ఆయోగ్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఎయిర్ పోర్టులో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ నివాస్ రాజ్ కుమార్ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం బయలుదేరారు.
వీరపనేనిగూడెం వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి గ్రామ ప్రజలు వినూత్నంగా స్వాగతం పలికారు. గ్రామస్థులు సేంద్రియ పద్థతిలో పండించిన పంటల స్టాల్స్ ని సందర్శించిన నీతి ఆయోగ్ బృందం అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించింది. గ్రామ సచివాలయ పనితీరుని నీతి ఆయోగ్ బృందానికి వివరించారు కలెక్టర్ నివాస్. ఇక ఆ గ్రామ ప్రజలు ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటల ఆహారపదార్ధాలను బృందానికి అందించారు. దీంతో బృందం ఎంతో సంతోషించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ బృందంతో పాటు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. NITI Aayog VC RajivKuma
కాగా.. మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ కానుంది నీతి ఆయోగ్ బృందం. సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లో ఏపీఐఐసి భవనంలో కొంత మంది పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ సహా విద్యావేత్తలతో సమావేశం కానుంది నీతి ఆయోగ్ బృందం. Veerapanenigudem