మన నిత్య జీవితంలో పండ్లు తప్పనిసరి అయిపోయింది. పెరుగుతున్న వాతావరణ పరిస్థితులు, దానికి తగ్గట్టు ఆరోగ్య సమస్యలు. మరి వీటిని జయించడానికి డాక్టర్లు ఎక్కువగా పండ్లు తినమని సూచిస్తారు. అవి కొందామని మార్కెట్ కి వెళ్తే పర్సు ఖాలీ. అయినా తప్పదు కాబట్టి కొంటాం. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు వందలు పెడితే కానీ రెండు మూడు రకాల పండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఒక్కో కుటుంబం పండ్ల కోసమే వారానికి కనీసం సుమారు రూ.1000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఒక్క పుచ్చకాయ ధర తెలిస్తే ఖంగు తినడం ఖాయం.
పుచ్చకాయ ధర ఏమాత్రం ఉంటుంది ? కిలో ఇరవయ్యో పాతికో ఉంటుంది… మూడు నాలుగు కిలోలకు అటూ ఇటుగా తూగినా వంద రూపాయలకు మించదని డిసైడైపోతాం. కానీ ఈ పుచ్చకాయ ధర వింటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా గిన్నెస్ రికార్డు బద్దలుకొట్టింది. యుబారి పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు. కేజీ యుబారి పుచ్చకాయ ధర లక్షల్లో ఉంటుంది. ధనవంతులు తప్ప సామాన్యులకు అందనంత ఖరీదైంది. యుబారీ పండు ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. ఈ ప్రత్యేక పండును జపాన్‌లో పండిస్తారు. వీటిని జపాన్‌లోని యుబారి ప్రాంతంలో పండిస్తారు. గ్రీన్‌హౌస్ లోపల సూర్యకాంతిలో ఈ పండును పెంచుతారు.
#Yubarimelon #MostExpensiveFruit #eruvaaka