వార్తలు

రైతుల కోసం వచ్చాం రాజకీయం చేయడానికి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

0
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy Press Meet In Delhi తెలంగాణాలో మిగులు ధాన్యాన్ని కూడా సేకరించాలని కోరుతూ తెలంగాణ మంత్రులు, ఎంపీలు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 6,952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని అయన తెలిపారు. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ ఈ రోజుతో పూర్తవుతున్నదని, కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన మరో 12, 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉందని చెప్పారు.

Minister Niranjan Reddy

అయితే ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన టార్గెట్ సరిపొవట్లేదని, ధాన్యం కొనుగోలుపై టార్గెట్ పెంచాలని కేంద్రానికి ఇది వరకే విన్నవించడం జరిగిందని గుర్తు చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాత ఖమ్మం, పాత నల్లొండ, పాత పాలమూరు కొన్ని నియోజకవర్గాలలో ఇంకా వరి కోతలు పూర్తి కాలేదన్నారు. వరి కోతలు జనవరి 15 వరకు జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు చెబుతున్నారన్నారు. అయితే తెలంగాణాలో సాగు అయిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రంతో భేటీలు నిర్వహించినప్పటికీ అనేక చేధు అనుభవాలు ఎదురయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని మంత్రి అన్నారు. Telangana Minister Delhi Tour Updates

Minister Niranjan Reddy

ఇక మేము రాజకీయాల కోసం ఢిల్లీకి రాలేదు .. రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చామని చెప్పారు మంత్రి. కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రం నుండి గత రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ కేశవరావు, లోక్ సభ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర రావు కార్యాలయాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ కేంద్ర మంత్రి కార్యాలయం నుండి భేటీకి అనుమతిస్తూ ఎలాంటి సమాచారం రాలేదని అసహనం వ్యక్తం చేశారాయన. కేంద్ర మంత్రి భేటీకి సమయం ఇచ్చే వరకు మా బృందం వేచిచూస్తుందని, రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూయించడం కేంద్రం బాధ్యత అని గుర్తు చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తుందని, వెంటనే పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి. Ministers And MPs Delhi Tour Over Paddy Issue

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy Press Meet ఇక వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణలోని 12,600 పై చిలుకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వానాకాలం వరి ధాన్యం టార్గెట్ , పెంచాలనేదానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనే దానికి తేడా తెలియదని సెటైర్లు పేల్చారు మంత్రి. కాగా.. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు ఎంపీలు కేశవరావు , నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమాలకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీలు రంజిత్ రెడ్డి , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. Telangana Paddy Procurement Issue 

Leave Your Comments

కలుపు మొక్క సాగుతో ఐశ్వర్యవంతులైపోండిలా!

Previous article

చైనీస్​ అరటి పండును చూశారా.. ఈ పంటతో ఎంత లాభమో తెలుసా?

Next article

You may also like