వార్తలు

రైతులకు మీరేం చేశారు…!

0
minister niranjan reddy
minister niranjan reddy

minister niranjan reddy . తెలంగాణ, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కెసిఆర్ రైతుల్ని పట్టించుకోవట్లేదన్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి .. అందుకే రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం అందేలా రైతుభీమాకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన 763 మంది రైతులకు రూ.3 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ పరిహారం ప్రకటించడంపై తెలంగాణ రైతులను పట్టించుకోలేదని కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు దుష్ప్రచారం చేయడంపై నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

bandi sanjay revanth reddy

                          bandi sanjay revanth reddy

Telangana Politics మూడేళ్లలో రూ.3384.95 కోట్ల రైతుభీమా పరిహారం, రూ.5 లక్షల చొప్పున 67,699 మంది రైతు కుటుంబాలకు లబ్ది చేకూరింది. ప్రపంచంలో రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి .. అందుకే రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం అందేలా రైతుభీమాకు రూపకల్పన చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సాయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేయడం, తెలంగాణ రైతులను పట్టించుకోలేదని ప్రచారం చేయడం సిగ్గు చేటని అన్నారు.

minister niranjan reddy

minister niranjan reddy ముందు రైతుభీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేసి మాట్లాడాలని సూచించారు. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, తెలంగాణ రైతులను వలసబాట పట్టించింది కాంగ్రెస్ పార్టీనే. రైతులకు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ సాయం చేసిన పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు స్వర్ణయుగంలా మారిందన్నారు మంత్రి. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటుతో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. Telangana Agriculture News

minister niranjan reddy

(Bjp & Congress )సాగునీరే కాదు కాంగ్రెస్ పాలనలో కనీసం ఎరువులు, విత్తనాలు కూడా దొరక్క రైతులు పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాసి లాఠీదెబ్బలు తిన్నారు. అన్నం పెట్టే రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాధ కాకూడదని, వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలకు ధైర్యం ఉండాలన్న ముందు చూపుతో కేసీఆర్ గారు రైతుభీమా ప్రవేశపెట్టారని అన్నారు. 2021 – 22 సంవత్సరానికి 35.64 లక్షల మంది రైతులకు రైతుభీమా ప్రీమియం చెల్లించడం జరిగింది. ఏడాదికి దాదాపు రూ.60 వేల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కేసీఆర్ గారి నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Leave Your Comments

కొలంబో కందితో లక్షల్లో ఆదాయం…

Previous article

గోడౌన్ సబ్సిడీ పథకం – ఎలా అప్లయ్ చేయాలి

Next article

You may also like