వార్తలు

కొనుగోళ్లపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి…!

0
Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy
Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ నేడు మహాధర్నాకు సిద్ధమైంది. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనుంది. ధర్నాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

cm kcr at trs maha dharna

వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తలా తోక లేకుండా మాట్లాడుతున్నరని మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని…రాష్ట్రాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్ర అస్పష్ట విధానంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. కేంద్రం తన ధర్మాన్ని నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారన్నారు. కేంద్రమంత్రి ( Kishan Reddy ) కిషన్ రెడ్డికి ఎడ్లు లేవు. ఆ పార్టీ అధ్యక్షుడు ( Bandi Sanjay ) బండి సంజయ్ కి బండి లేదు అంటే ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ గొడవ చేయడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో 6500 పైచిలుకు కొనుగోలు కేంద్రాలకు గాను 5 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పిన మంత్రి… కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో ఉత్తరాది రైతాంగం ఉడికిపోతుంది .. కేంద్రం దక్షిణాదిన మంట పెట్టొద్దు .. రైతుల సహనానికి పరీక్ష పెట్టకండి అంటూ మండిపడ్డారు.

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

kishan reddy . bandi sanjay

రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని, దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణ రైతుల ధాన్యం కొంటామని లిఖిత పూర్వకంగా రాసివ్వండి అంటూ డిమాండ్ చేశారు. కేంద్రం అస్పష్ట, హేతుబద్ధత లేని విధానాల మూలంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతాలు సృష్టించుకున్నాం. రెండు, మూడు పంటలు పండించుకుంటూ రైతన్నలు సంతోషంగా ఉన్న ఈ పరిస్థితులలో కేంద్రం చర్య అనాలోచితమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైతులు పంటలు పండించుకుంటున్నారు .. కేవలం వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఎందుకు ఒప్పుకోవడంలేదో చెప్పాలని అన్నారు.

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

Procure Paddy

( Telangana Farmers Paddy Issue )కేంద్ర ప్రభుత్వ తలాతోకాలేని విధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. తెలంగాణలో 62.13 లక్షల ఎకరాలలో ఈ వానాకాలం వరి సాగు చేశారు. కానీ కేంద్రం మాత్రం ఇన్ని ఎకరాలలో సాగు చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ వ్యవసాయ డాటాను గతంలో కేంద్రమే అభినందించింది. కానీ ఇప్పటికీ ఎంత వరి ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వడం లేదు. దేశంలోనే అత్యధిక ధాన్యం తెలంగాణ నుండి సేకరించామని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. కేంద్రం తన నిర్ణయాలను సమీక్షించుకుని తెలంగాణకు సహకారం అందించాలి. ఉత్తరాదిన వానాకాలం వరి సాగు చేయరు. దక్షిణాదిన, అందునా తెలంగాణలోనే అత్యధిక శాతం వరి పండించేది .. తర్వాత ఆంధ్ర లోనే. మిగతా రాష్ట్రాలలో పండదు కాబట్టి పండే రాష్ట్రాలను ప్రోత్సహించాలని అన్నారు.

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

Paddy issue in telangana

కరోనా విపత్తులో ప్రపంచంలో అన్నీ బంద్ అయినా అన్నం పెట్టే అన్నదాత వృత్తి వ్యవసాయం బంద్ కాలేదు. కోట్లాది మంది ఆధారపడిన వ్యవసాయ రంగం కోసం కేంద్రం తన నిర్ణయాలను సమీక్షించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో అంతిమ విజయం కోసం ఐకమత్యంతో పోరాడుదామని పిలుపునిచ్చారు మంత్రి. రైతుకు నష్టం చేసిన ఏ ప్రభుత్వం ముందలపడలేదు నీళ్ల కోసమే యుద్దం మొదలుపెట్టి, నీళ్లలో నిప్పులు పుట్టించి ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని..అద్భుతమైన ప్రాజెక్టులతో సాగునీటి వసతి కల్పించి బ్రహ్మాండమైన పంటల సాగుకు బాటలు వేశారు

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

Minister Nirajan Reddy Demanding Centre to Procure Paddy

మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణతో భూగర్భ జలాలు పెరిగాయి, 24 గంటల కరంటు ఉచితంగా సరఫరా, రైతు బంధు, రైతు భీమా పథకాలతో భీడువడ్డ పొలాలను వలసెల్లిన రైతులు, విదేశాలకు వెళ్లిన వారు తిరిగి సాగులోకి తీసుకొచ్చారు. ఇంతటి ఘనత సాధించిన తెలంగాణ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం ఇవ్వకుండా చేతులెత్తేయడం అన్యాయం. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు. ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనని చెప్పారు.

Also Read : వెల్లుల్లి పండించే విధానం.. ప్రయోజనాలు..!

Leave Your Comments

మిరపలో తామర పురుగులకు నివారణ చర్యలు…

Previous article

వెల్లుల్లి పండించే విధానం.. ప్రయోజనాలు..!

Next article

You may also like