వార్తలు

అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్-2022

0
Agri Film Festival-2022

Agri Film Festival-2022 : అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్-2022  కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ ఎంట్రీలను కోరింది. మార్చి 11న జరగనున్న అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్- 2022 కోసం వ్యక్తులు మరియు సంస్థల నుండి ఎంట్రీలను కోరుతున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.క్షేత్రస్థాయి ఆవిష్కరణలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, రైతు సాధికారత మరియు విస్తరణ నిర్వహణలో ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది.

అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్-2022 విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వబడును అని సంస్థ అధికారి తెలిపారు. కాగా.. ఎంట్రీల చివరి తేదీ ఫిబ్రవరి 10గా నిర్ణయించారు. Agri Film Festival-2022

Agri Film Festival-2022

కింద పేర్కొన్న అంశాలపై చిత్రాలను తీయాల్సి ఉంటుంది

అగ్రికల్చరల్ టెక్నాలజీస్ పురోగతి

వ్యవసాయ విస్తరణ నిర్వహణలో ఆవిష్కరణలు

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్

వ్యవసాయ మార్కెటింగ్

సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్

హార్టికల్చర్

పశుసంరక్షణ

డెయిరీ నిర్వహణ

మత్స్య అభివృద్ధి

ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పథకాలు మరియు ప్రాజెక్టులు

Leave Your Comments

2022-23 బడ్జెట్‌లో రైతు రుణాల పెంపు

Previous article

ఏడో రోజు రైతుల ఖాతాలోకి రూ.201.91 కోట్లు

Next article

You may also like