వార్తలు

రైతుల తలరాత మార్చే ప్రాజెక్టు ఇది : హరీష్

0
Mallannasagar will benefit farmers for generations says Harish Rao
Mallannasagar will benefit farmers for generations says Harish Rao

మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను ఆకస్మికంగా సందర్శించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి హరీష్ ఆకస్మిక సందర్శన చేశారు. గలగలమంటూ గోదారి నీళ్లు మల్లన్న పాదాలను తాకుతున్న దృశ్యాలను చూసి మంత్రి ఎంతో సంతోషించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ .. రైతుల తలరాత మార్చే ప్రాజెక్టు ఇది .. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ అని అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని పూర్తి చేశామని సంతోషం వ్యక్తం చేశారు. సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని తెలిపారు. ఈ మేరకు హరీష్ రావు ప్రాజెక్టు వివరాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని టీఏంసీల నీళ్లు వచ్చాయని, ఎన్ని మీటర్ల ఎత్తు వరకూ వచ్చాయో.. ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆరా తీశారు. 11 టీఏంసీల మేర నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకూ పైకి నీళ్లు వచ్చాయని, బండ్ మొత్తం 22 కిలో మీటర్లు ఉండగా., దాదాపు 20 కిలో మీటర్ల మేర నీళ్లు చేరినట్లు ఇరిగేషన్ డీఈ సుమన్, జేఈ భరత్ లు మంత్రి హరీష్‌ రావుకు వివరించారు.

అయితే అంతకుమందు మంత్రి హరిశ రావు తొగుట జడ్పిటిసి గాంధారి ఇంద్రసేనా రెడ్డి మరణించిన విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అన్ని వేళల అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. మంత్రి హరీష్ రావు వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తొగుట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

#Mallannasagar #farmers #HarishRao #Telanganaagriculturenews #kaleshwaramproject #eruvaaka

Leave Your Comments

నాగాలాండ్ రైతుల ఆవేదన…

Previous article

మార్పు మొదలైంది…

Next article

You may also like