వార్తలు

సామాన్యులకు గుడ్‌న్యూస్‌…

0
Major edible oil players cut wholesale prices
Oil Prices

దేశంలో వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెడగడం మరింత భారంగా మారింది. రూ .70 ధర నుంచి ఏకంగా 200 రూపాయల వరకు వంట నూనె ధరలు పెరిగాయి. దీంతో సగటు సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వంట నూనెలపై భారం తగ్గించేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. వంట నూనె రేటును లీటర్‌‌‌‌‌‌‌‌పై రూ.4–7 వరకు తగ్గించాయి. అదానీ విల్‌‌‌‌మర్‌‌‌‌‌‌‌‌, రుచి సోయా ఇండస్ట్రీస్‌‌‌‌ కంపెనీలు తమ హోల్‌‌‌‌ సేల్ రేట్లను తగ్గించాయని సాల్వెంట్ ఎక్స్‌‌‌‌ట్రాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్ (ఎస్‌‌‌‌ఈఏ) వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఇతర వంటనూనె తయారీ కంపెనీలయిన జెమినీ ఎడిబుల్స్‌‌‌‌ , ఫ్యాట్స్‌‌‌‌ ఇండియా (హైదరాబాద్‌‌‌‌), మోడీ నేచురల్స్‌‌‌‌ (ఢిల్లీ), గోకుల్‌‌‌‌ రీఫోయిల్స్‌‌‌‌ అండ్ సాల్వెంట్‌‌‌‌ (సిధ్‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌), విజయ్ సాల్వెక్స్‌‌‌‌ (అల్వర్‌‌‌‌‌‌‌‌), గోకుల్‌‌‌‌ ఆగ్రో రిసోర్సెస్‌‌‌‌, ఎన్‌‌‌‌కే ప్రొటీన్స్‌‌‌‌ (అహ్మదాబాద్‌‌‌‌) వంటి కంపెనీలు కూడా త్వరలో రేట్లు తగ్గిస్తాయని ఎస్‌‌‌‌ఈఏ ప్రకటించింది.

కరోనా సమయంతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఓ సమయంలో హోల్‌సేల్ ధరలు కంపెనీని బట్టి రూ.170 నుండి ఆ పైకి వెళ్ళాయి. రిటైల్ ధరలు రూ.180 దాటాయి. ఇప్పుడు రిటైల్ ధరలే రూ.150 స్థాయికి దిగి వచ్చాయి. ఇది కాకుండా, ప్రపంచ ఆహార చమురు సరఫరా పరిస్థితి మెరుగుపడుతోంది .. ఇది అంతర్జాతీయ ధరలను మరింత చల్లబరుస్తుంది . తద్వారా తదుపరి వివాహ సీజన్‌లో దేశీయ ధరలు మరింత తగ్గుముఖం పట్టొచ్చు. కాగా పండుగ సమయంలో వినియోగదారులకు ఇది కాస్త ఊరట అనే చెప్పాలి.

#Cookingoilprices #agriculturenews #latesttelugunews #eruvaaka

Leave Your Comments

పత్తి దిగుబడిపై సిఎఐ అంచనా ఇది…

Previous article

పత్తి విత్తనాల్లో కల్తీ ఉంటే కఠిన చర్యలు…

Next article

You may also like