వార్తలు

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..

0

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 17 న ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకుల కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం, భీం – ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ దిశా నుంచి గాలులు వీస్తున్నాయని మంగళ, బుధవారాల్లో ఒకటి ,రెండు ప్రదేశాల్లో మాత్రం పొగమంచు ఏర్పడనుందని, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని వివరించింది.

Leave Your Comments

రాష్ట్రంలో కందికి డిమాండ్..

Previous article

బీన్స్ సాగు లాభదాయకం..

Next article

You may also like