వార్తలు

తెలంగాణలో కోటి వృక్షార్చన కార్యక్రమం..

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కేసీఆర్ అభిమానులు, తెరాస శ్రేణులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు దాదాపు కోటి మొక్కలు నాటి కేసీఆర్ పై అభిమానం చాటుకున్నారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటీ వృక్షార్చన లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గద్వాల సమీపంలో వీరాపురంలో మొక్కను నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. కోటి వృక్షార్చన లో భాగంగా ప్రగతి భవన్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ తో పాటు సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య మొక్కలు నాటారు.
ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాగోలు వద్ద మూసితీరంలో మొక్కలు నాటారు. సిద్ధిపేట లో రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ మధ్యలో మంత్రి హరీశ్ రావు మొక్కలు నాటారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు.
కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా గుచ్చి బౌలి బొటానికల్ గార్డెన్ లో అటవీశాఖ అధికారులతో కలిసి మన్త్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 2.10 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.
కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా ఖమ్మంలోని సీబీఐటీ కళాశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నాగేశ్వరరావు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments

ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేక పాలసీ..

Previous article

ధనియాలు థైరాయిడ్ గ్రంథిని కాపాడతాయా..

Next article

You may also like