వార్తలు

వ్యవసాయ సామాగ్రికి సొంత పరిజ్ఞానం జోడించి యంత్ర తయారీ..రైతు రవీందర్

0

గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన రవీందర్ ఐటీఐ పూర్తి చేశారు. సాగులో వినియోగించే వ్యవసాయ సామాగ్రికి సొంత పరిజ్ఞానం జోడించి ఆటో యంత్రంతో రోటోవేటర్ మాదిరిగా వుండే ఓ పరికరం తయారు చేశారు. మార్కెట్ లో దీని ధర రూ.50 – 60 వేల వరకు వుంది. ఈ యంత్రంతో అంతరకృషితో పాటు, ప్రత్యేకంగా పందిరి పద్దతిలో సాగు చేసే కూరగాయల తోటలలో కలుపు తీయవచ్చు తాజాగా మల్చింగ్ పద్ధతిలో భాగంగా మడులు చేసిన తర్వాత దానిపై ప్లాస్టిక్ కవర్ వేయడంతోపాటు అది లేచిపోకుండా ఇరు పక్కల కప్పుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ఓ రైతు ఉపయోగిస్తున్న పరికరాన్ని చూసిన ఈయన కొన్ని మార్పులు, చేర్పులు చేసి మల్చింగ్ ను సులువుగా వేసేందుకు పరికరం తయారు చేశారు. రెండు ఎడ్లు కట్టి కేవలం ఇద్దరు కూలీలు ఒక రోజులో నాలుగు ఎకరాలు మల్చింగ్ వేసేలా ఈ పరికరం తయారీకి రూ. 7 వేలు ఖర్చు తక్కువ శ్రమ, సమయం ఆదా కావడంతో పాటు ఎకరానికి రూ.2,500 పెట్టుబడి తగ్గుతుందని రవీందర్ తెలిపారు.
రవీందర్ ఆలోచన బాగుంది. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ పరికరాన్ని ఇతర రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తాం అని ఉద్యానశాఖ అధికారి తెలిపారు.
ఇటీవల కాలంలో సాగులో యంత్రాల వినియోగం పెరిగింది. వీటి కొనుగోలు, రాయితీల గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫార్మ్ మిషనరీ సొల్యూషన్స్ (ఫామ్స్) పేరిట యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా కొనుగోళ్లే కాకుండా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. ట్రాక్టర్లు, నాటు వేసే , దుక్కి దున్నే, కోత యంత్రాల వివరాలను తెలుసుకోవచ్చు.

Leave Your Comments

వరి కంకులతో అందాలు..గౌరవ డాక్టరేట్

Previous article

విటమిన్ డి లోపం వలన కలిగే ఆరోగ్య నష్టాలు..

Next article

You may also like