Kishan Reddy Fires On KCR యాసంగి పంట వరి కొనుగులుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పంట సేకరణపై రెండు ప్రభుత్వాల తీరు భిన్నంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా పంట కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల్ని తెరాస ప్రభుత్వం మోసం చేస్తుందన్న కిషన్ రెడ్డి అసలు తెరాస వల్లే రైతులకు కష్టాలు వస్తున్నాయన్నారు. తెరాస ప్రభుత్వం బీజేపీ పై బురజల్లే ప్రయత్నం చేస్తుంది, మేము ధాన్యం కొనబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు మంత్రి కిషన్ రెడ్డి. అయితే ఈ సీజన్లో పంటను మాత్రమే కొంటామని, చివరి బస్తా వరకూ కేంద్రం కొంటుందన్నారు. కానీ ఉప్పుడు బియ్యాన్ని మాత్రం సేకరించబోమని మొదటి నుంచి చెప్తున్న మాటే అని అన్నారు.
తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామన్న కేసీఆర్ కనీసం ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నేతలు స్వయంగా నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం సాయం లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇక వ్యవసాయంపై కేసీఆర్ సరైన అవగాహన లేకుండా పోయిందన్నారు. దీంతో రైతుల్ని ఇబ్బంది పెడ్తున్నాడు అని అన్నారు. ఒకసారి మక్క వద్దంటారు, మరోసారి సన్న బియ్యం వేసుకోమంటారు.. దీంతో ప్రభుత్వ చర్యలవల్ల రైతులు అయోమయంలో పడిపోయారని అన్నారు మంత్రి కిషన్ రెడ్డి. Kishan Reddy vs CM KCR
Paddy Procurement కేంద్రం ఇచ్చే బియ్యాన్ని టీఆర్‌ఎస్ నేతలు రీసైక్లింగ్ చేస్తున్నారని, రైతుల పేరు మీద ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారన్నారు. మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. వరిని మేం కొనబోమని ఎక్కడ చెప్పలేదని స్పష్టం చేశారు. కొనుగోలు విషయంలో రైతుల్ని ఒప్పించాలి అంతేకాని కేంద్రంపై నెపం వేస్తే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కేంద్రం పై ద్వేషపూరిత భావం కలిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.