వార్తలు

కేసీఆర్‌ ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగు: రేవంత్

0
KCR produces paddy
  • కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు

  • వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ వరి పండిస్తుండు

  • సీఎంకో న్యాయం..రైతులకో న్యాయమా?

  • రైతులందరూ వరి వేయండి.. ఎలా కొనడో చూస్తా: రేవంత్

KCR produces paddy

KCR produces 150 acres of paddy వరి వేస్తే ఉరే అని రైతుల్ని హెచ్చరించిన సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వరి వేస్తుండు. రైతుల్ని వరి వేయొద్దని చెప్పి ఆయన మాత్రం 150 ఎకరాల్లో వరిని సాగు చేస్తుండు. సీఎంకో న్యాయం, రాష్ట్ర ప్రజలకో న్యాయమా అంటూ దుయ్యబట్టారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Revanth Reddy Fires On CM KCR. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రైతులు యాసంగి వరి వేసుకోవాలని, పంటలు కొనకుంటే టీఆర్‌ఎస్‌ నేతలను చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రాష్ట్ర రైతులను మోసం చేస్తున్నాయి .కేంద్రం వడ్లు కొనకపోయినా రాష్ట్రం వడ్లు కొనాల్సిందే, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు రేవంత్. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి పండిస్తున్నట్టు నా దగ్గర వీడియోలతో సహా ఆధారాలున్నాయి. సీఎం కేసీఆర్ సొంతపొలంలో పండించిన వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారో చెప్పాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్… నీ భూమి పచ్చగుండి, నీ కడుపు సల్లగుంటే సరిపోతాదా, రైతులు బాగుపడక్కర్లేదా అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. KCR produces paddy

revanth reddy

KCR Farm House యాసంగి పంటను రాష్ట్రమే కొనుగోలు చేయాలనీ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సీఎం భూపేశ్‌‌‌‌ భగేల్‌‌‌‌ మద్దతు ధర కన్నా రూ. 600 ఎక్కువ ఇచ్చి ధాన్యాన్ని కొంటున్నారని తెలిపారు రేవంత్ . ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ క్వింటాకు రూ. 2,540 ఇచ్చి వడ్లు కొంటోందని, యాసంగిలో వరి వేయని రైతాంగానికి చిరు ధాన్యాలు సాగు చేసేందుకు ఎకరాకు రూ. 9 వేల బోనస్‌ ఇస్తోందని చెప్పారు. 1960లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎమ్మెస్పీ విధానం తీసుకువచ్చిందని, దేశంలో 23 రకాల పంటలకు మద్దతు ధర కల్పించిందన్నారు. ఎమ్మెస్పీ ఉన్న పంటలను కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఈ విషయం ఎమ్మెస్పీ చట్టంలోనే ఉందని, కేసీఆర్‌‌‌‌కు చదువు రాకుంటే చదువు వచ్చిన వాళ్లతో ఆ చట్టం చదివించుకోవాలని విమర్శించారు. CM KCR cultivates paddy in 150 acres

KCR produces paddy

వడ్లు కొనని సీఎం మనకు అవసరం లేదు. రైతుల కడగళ్లు వింటుంటే గుండె తరుక్కుపోతుంది అని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ తెలంగాణాలో ధాన్యం సేకరణ చేపట్టకపోతే మునుముందు రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమమే అంటూ హెచ్చరించారు. కార్పొరేట్ల ప్రయోజనాలకోసం కేంద్రం పని చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తాసు పలుకుందన్నారు. అందుకే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ ఒక ప్రకటన కూడా చేయలేదని చెప్పారు. ఇక ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకున్న కేసీఆర్‌‌‌‌ ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా సాయం చేయలేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. KCR vs Revanth

Leave Your Comments

300 కిలోల కంబాల టేకు చేప

Previous article

Pusa Bio Decomposer: పొట్టును కాల్చే కాలుష్యానికి పరిష్కారం

Next article

You may also like