వార్తలు

రైతు కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా !

0
KCR Announces Compensation Of 3 lakh
KCR Announces Compensation Of 3 lakh

KCR Announces Compensation Of 3 lakh. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు వ్యవసాయ సాగు చట్టాల రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డం రైతు విజ‌యం అని స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోడీ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్ చనిపోయిన రైతు కుటుంబ సభ్యులకి నష్టపరిహారం కిందా ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక చట్టాలను రద్దు చేసిన విధంగానే ఉద్యమంలో నమోదైన కేసులను కూడా తొలగించాలని ప్రధాని మోడీని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున ఉద్యమంలో చనిపోయిన 750 రైతుల కుటుంబ సభ్యులకి రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. KCR Announces Compensation Of 3 lakh For 750 Farmers Families

KCR Announces Compensation Of 3 lakh

KCR Announces Compensation Of 3 lakh

3 Farm Laws Dismissed తెలంగాణ వరి కొనుగోలు అంశంపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రకటించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని అన్నారు సీఎం. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చించేందుకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢీల్లి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని తెలిపారు.

KCR Announces Compensation Of 3 lakh

KCR vs Modi

ఇక వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ అమలు చేయాలని సూచించారు. కాగా.. విద్యత్ చట్టాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి డిమాండ్ చేశారు. సెక్షన్ 3 కింద గోదావరి, క‌ృష్ణా నది నీటి పంపకాలపై ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో నీటి పంపకాలను తేల్చాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, జల్ శక్తి మంత్రిని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. KCR Announces Compensation Of 3 lakh For 750 Farmers Families

Leave Your Comments

పియర్స్ పండు ఆరోగ్య ప్రయోజనాలు !

Previous article

క్వినొవా సాగులో మెళకువలు

Next article

You may also like