వార్తలు

కోట్లు ఇస్తామన్నా వద్దని విమానాశ్రయం దగ్గర వ్యవసాయం చేస్తున్న జపాన్ రైతు..

0

విమానాశ్రయాలు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి, రోడ్లు వేయడానికి  సాధారణంగా ఎంతో మంది రైతుల పొలాలను ప్రభుత్వం భూసేకరణ పేరుతో తీసుకోవడం చూస్తుంటాం. కానీ జపాన్ కు చెందిన ఒక రైతు నుంచి పొలాన్ని తీసుకోలేక అక్కడి ప్రభుత్వం ఏకంగా దాని చుట్టూ విమానాశ్రయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేను ఆనుకొని ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు. టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే విమానాల రణగొణ ధ్వనుల మధ్య ఆ రైతు కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు. ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
జపాన్ లోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో నరిత అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. న్యూ టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని కూడా దీన్ని పిలుస్తారు. 1960 ల్లో ఈ విమానాశ్రయం నిర్మించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టోక్యో శివారులోని నరిత అనే గ్రామం సహా చుట్టు పక్కల గ్రామాల్లో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇప్పుడు విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం చేస్తున్న రైతు టకావో షిటో తండ్రి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. చాలామంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తీసుకొని విరామానాశ్రయానికి భూములు రాసిచ్చి నగరబాట పట్టారు. కానీ షిటో తండ్రి మాత్రం తనకు ఎన్ని కోట్లు ఇచ్చినా తన భూమిని ఇచ్చేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. అయినా సరే జపాన్ ప్రభుత్వం మొండిగా షిటో తండ్రిపై కేసు పెట్టింది. కానీ కోర్టులో అది షిటో తండ్రికి అనుకూలంగా రావడంతో వారి కుటుంబం అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.

Leave Your Comments

వివిధ పంటలలో బోరాన్ పోషక ప్రాముఖ్యత..

Previous article

వేసవిలో పంట పొలాల యాజమాన్యం..

Next article

You may also like