ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు కర్రికులమ్ ని కాలానికి అనుగుణంగా మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకి అనువుగా కర్రికులమ్ ని మార్చేందుకు వర్సిటీకి హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎబి) మార్గదర్శకాన్ని అందించింది. సిలబస్లో తీసుకు రావాల్సిన మార్పుల్ని సూచిస్తూ ఐఎస్బి- సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ ఒక నివేదికను వర్సిటీ అగ్రిహబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావుకి ఐఎస్బి సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ డీన్ ప్రొఫెసర్ శేషాద్రి అందజేశారు. ఈ నివేదిక రూపకల్పనలో వర్సిటీ, ఐఎస్ బిలు, వ్యవసాయరంగ నిపుణులు, విద్యావేత్తలు, ఎంటర్ ప్రెన్యూర్స్ తదితరుల అభిప్రాయాలు తీసుకు న్నారు. ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూట్ సంధానం, ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ ల వినియోగం తదితర అంశాల్ని ఈ నివేదికలో పొందుపరిచారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లని అవకాశాలుగా మలచుకునే నైపుణ్యాల్ని అలవర్చుకునేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి వర్సిటీ కృషి చేస్తోందని ఉపకులపతి ప్రవీణ్ రావు అన్నారు. అందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వాములవుతున్నామని అన్నారు. వ్యవ సాయరంగానికి ఎంటర్ ప్రెన్యూర్సుకి పూర్తిస్థాయిలో ఉపయోగపడే విధంగా ఈ మధ్యనే అగ్రిహబ్ ని ప్రారంభించామని వివరించారు. అధునాతన టెక్నాలజీలని అందిపుచ్చుకోవడానికి అనునిత్యం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో, విద్యార్థుల్లోనూ ఎంటర్ ప్రెన్యూర్షిప్ నైపుణ్యాలని పెంపొందించ డానికి చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఐఎస్బి సహకారంతో రూపొందించిన కొత్త ఎస్ఎబిఎం కర్రి కలమ్ అగ్రిబిజినెస్ లో ప్రపంచస్థాయి ప్రమాణాలని నెలకొల్పుతుందన్న ఆశాభావాన్ని ప్రవీణ్ రావు వ్యక్తం చేశారు.
వేగంగా మారుతున్న ప్రపంచంలో ఎప్పటికప్పుడు బోధన, కర్రికలమ్ లో మార్పులు రావాలసి ఉన్నదని పిజెపీఎస్ఎయు ఆ దిశగా ముందుకు వెళుతోందని ఐఎస్బీ- సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ జీన్ ప్రొఫెసర్ డివిఆర్. శేషాద్రి అభిప్రాయపడ్డారు. కర్రికులమ్ లో కాలానుగుణంగా మార్పులు తీసుకు రావడం వల్ల వ్యవసాయరంగానికి, గ్రామీణ సమాజానికి మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రా యపడ్డారు. మార్కెట్లు-అప్లికేషన్-ఓరియెంటేషన్ కేంద్రంగా సిలబసును సూచించామని శేషాద్రి వివవించారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్, పిజి.స్టడీస్ డీన్ డాక్టర్ వి.అనిత, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జగదీశ్వర్, డీన్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, అగ్రిహబ్ ఎండి. కల్పనాశాస్త్రి, అగ్రిహబ్ బోర్డ్ మెంబర్ అనిల్ కుమార్ వి.ఏపూరు, ఎస్ఎఎం సిబ్బంది పాల్గొన్నారు.
#prof jayashankar agricultural university #curriculum #agriculture #eruvaaka