వార్తలు

దేశాభివృద్ధిలో వ్యవసాయం కీలకం : నీతి ఆయోగ్

0
Indian economy to grow by more than 10% in FY22 Says Rajiv Kumar
Indian economy to grow by more than 10% in FY22 Says Rajiv Kumar

దేశాభివృద్ధికి వ్యవసాయం ఎంతగానో తోడ్పడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరింత అభివృద్ధి చెంది దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాడు ఇవ్వనుంది. అందులో భాగంగా రికార్డ్ స్థాయిలో ఖరీఫ్ పంట, రబీ పంట 10 శాతం జీడీపీకి తీసుకెళ్లనున్నాయని అన్నారు రాజీవ్ కుమార్.

అయితే ప్రతుతం పెరుగుతున్న ఇంధన వనరుల ధరలు, రవాణా సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇక దేశంలో ఎగుమతుల శాతం పెరగడంతో అది ఉపాధి కల్పన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ మేరకు 2021 – 2022 సంవత్సర కాలంలో 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తుందని రాజీవ్ పేర్కొన్నారు. వృద్ధి ధోరణికి కాంట్రాక్ట్‌ ప్రేరిత సేవలు దోహదపడతాయి. విస్తృత ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ వృద్ధికి తోడ్పాటును ఇచ్చే అంశం. తదుపరి వేవ్‌ వచ్చినా, నష్టం తక్కువగా చోటుచేసుకోవడానికి దోహపదడే అంశం ఇది. విద్యుత్‌ వినియోగం, రైల్వే రవాణా, జీఎస్‌టీ వసూళ్లు, ఈ–వే బిల్స్‌ విభాగాలు ఆర్థిక వృద్ధి రికవరీని సూచిస్తున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 9.5 శాతంగా అంచనావేస్తుండగా, ఐఎంఎఫ్‌ అంచనా కూడా ఇదే స్థాయిలో ఉంది.

దేశంలో వ్యవసాయానికి ప్రభుత్వాలు తోడ్పడు అందిస్తున్నప్పటికీ దళారులు రైతుల కష్టాన్ని మింగేస్తున్నారు. వారి పంటకు మద్దతు ధర ఇవ్వకుండా వారు చెప్పిన రేటుకే పంటను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపితే వ్యవసాయంలో ఇంకా గణమైన మార్పులు చూడొచ్చు.

#Indianeconomy #NitiVCRajivKumar #NitiAayog #AgricultureLatestNews #Eruvaaka

Leave Your Comments

వరిలో జింక్ లోపం… కారణాలు ఏంటి ?

Previous article

వైట్ మస్లీతో లక్షల్లో ఆదాయం…!

Next article

You may also like