వార్తలు

నూనె ధరలు మరింత తగ్గనున్నాయా ?

0
crude oil price

India to release 5 million barrels of crude oil నూనె ధరల విషయంలో కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవచ్చు. కరోనాకు ముందు గరిష్టంగా నూనె ధరలు రూ.80 ఉండేది. కానీ కరోనా సృష్టించిన కల్లోలం అనంతరం వంట నూనె ధరలు రూ.200 కు చేరింది. ఇది సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపింది. వంట నూనె కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్రాన్ని విమర్శించిన పరిస్థితి. అటు విపక్షాలు సైతం కేంద్రం తీరుని తప్పుబట్టాయి. కాగా ప్ర‌స్తుతం నూనె ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వ‌ర‌కు తగ్గాయి.

cooking oil

దీపావళి సమయంలో వంట నూనె ధరలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా కేంద్రం చ‌ముదు ధ‌ర‌ల‌పై వ్యాట్‌ను త‌గ్గించింది. తాజాగా, కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. అత్య‌వ‌స‌ర నిల్వ‌ల నుంచి దాదాపు 50 ల‌క్ష‌ల బ్యారెళ్ల ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం.

cooking oil

India to release 5 million barrels of crude oil గతంలో చమురు ధరలను తగ్గించేందుకు అమెరికా, జపాన్ తదితర దేశాలు ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి. దాంతో సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అదే తరహా వ్యూహాత్మక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భార‌త్‌కు నార్త్‌, ఈస్ట్ తీరాల్లో చ‌మురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇక్క‌డి నుంచి ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసి వినియోగిస్తుంటారు. ఈ వ్యూహాత్మ‌క చ‌మురు నిల్వ కేంద్రాల్లో దాదాపు 3.8 కోట్ల బారెళ్ల ముడి చ‌మురును నిల్వ‌చేస్తారు. వ‌చ్చే వారం ప‌ది రోజుల్లో ఈ చ‌మురు నిల్వ కేంద్రాల నుంచి మంగుళూరులోని ఎంఆర్‌పీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు త‌ర‌లించ‌నున్నార‌ని స‌మాచారం.

Leave Your Comments

దేశంలో ఎరువుల కొరత లేదు…

Previous article

మూడు సాగు చట్టాలను రద్దు చేసే తేదీలు…

Next article

You may also like