వార్తలు

ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియా ను ప్రవేశపెట్టిన ఇఫ్కో..

0

రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గించి, దిగుబడులను పెంచే దిశగా త్వరలో సరికొత్త యూరియా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా “నానో యూరియా” ను భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) సోమవారం ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా.. ద్రవ రూపంలో ఉంటుంది. 500 మిల్లీ లీటర్ల బాటిల్ ధర కేవలం రూ. 240. సంప్రదాయ యూరియా బస్తా ధరతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇఫ్కో 50వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్బంగా నానో యూరియాను ప్రవేశపెట్టారు. ఈ నెల నుంచే దాని ఉత్పత్తిని ప్రారంభించి, త్వరలోనే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. పెట్టుబడి ఖర్చును తగ్గించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తాజా ఆవిష్కరణ దోహదపడుతుందని ఇఫ్కో ఓ ప్రకటనలో తెలిపింది. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా సీసా.. కనీసం ఒక బస్తా సంప్రదాయ యురియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఈ యూరియా వాడకంతో పంటల దిగుబడి సగటున 8 శాతం పెరుగుతున్నట్లు క్షేత్ర స్థాయి పరిశీలనల్లో తేలింది. గుజరాత్ లోని కలోల్ లో ఉన్న ఇఫ్కో నానో బయటెక్నాలజీ పరిశోధన కేంద్రం నానో యూరియాను అభివృద్ధి చేసింది.

Leave Your Comments

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు..

Previous article

వ్యవసాయ అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like