వార్తలు

ICAR రౌండ్2 ఫలితాలు విడుదల..

0
ICAR Round 2 Seat Allotment Result 2021

ICAR Round 2 Seat Allotment Result 2021 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 2021 కౌన్సిలింగ్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన డేటా అంత అధికారిక వెబ్ పోర్టల్ లో పొందుపరిచారు. UG, PG మరియు PhD కోర్సులకు గాను 2 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇక అభ్యర్థుల సీటు అలాట్‌మెంట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్స్ ని అప్‌లోడ్ చేయడం, ప్రవేశ రుసుము చెల్లించడం మొదలైన ప్రక్రియ కోసం పోర్టల్ ఓపెన్ చేయగలరు. ICAR Round 2

ICAR Round 2

అభ్యర్థులు తప్పనిసరిగా ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క అధికారిక కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో సెకండ్ రౌండ్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. పోర్టల్ లోకి వెళ్లాలంటే ముందుగా మీ అప్లికేషన్ నంబర్ & పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతో రౌండ్ 2 సీట్ల కేటాయింపు మరియు ICAR కౌన్సెలింగ్ 2021 వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డ విషయం తెలిసిందే. నవంబర్ 26 న ICAR కౌన్సిలింగ్ ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ రౌండ్‌లో సీటు పొందని వారు ICAR కౌన్సెలింగ్ 2021 మూడవ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ICAR Counseling 2 Results 

Leave Your Comments

ఈ- శ్రమ్ పథకం గూర్చి మీకు తెలుసా..

Previous article

రైతు నెల ఆదాయం ఎంత?

Next article

You may also like