రైతుల కోసం ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చే పథకాలలో అద్భుతమైన పథకం కిసాన్ క్రెడిట్ కార్డు. ( Kisan Credit Card )ఈ కార్డు రైతులకి ఎంతో ప్రయోజనకరంగా మారింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6 వేలు పొందుతున్న వారు ఇప్పుడు సులభంగానే లోన్ పొందే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు లభిస్తాయి.
రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పై రుణం పొందవచ్చు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఈ రంగం ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అర్హులైన వ్యక్తులు వెంటనే దగ్గరలోని బ్యాంకులను సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డులని పొందండి. కేసీసీ కార్డు ద్వారా గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే ఇందులో సబ్సిడీ రూపంలో తగ్గింపు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం 2 శాతం రాయితీ అందిస్తుంది. దీంతో వడ్డీ రేటు 7 శాతానకి దిగివస్తుంది. మీరు కరెక్ట్ టైమ్‌కి లోన్ చెల్లిస్తే.. అప్పుడు వడ్డీ రేటు మళ్లీ 3 శాతం తగ్గుతుంది. అంటే మీకు 4 శాతం వడ్డీ పడుతుంది.
(How To Apply KCC )కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేయండిలా: స్థానికంగా ఉండే ఏదైనా బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్లో ఉండే సిబ్బందిని సంప్రదించాలి. దరఖాస్తు ఫామ్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయాలి. లోన్ అధికారులు దరఖాస్తును పరిశీలించి కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు.
అవసరమైన పత్రాలు
1. గుర్తింపు కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, తదితర గుర్తింపు కార్డులు
2.వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు
3.ధరఖాస్తుదారుడి ఫోటోలు
4. ఇంటి చిరునామా
Also Read : రైతులకి మోడీ గుడ్ న్యూస్