పదిమందికి అన్నం పెట్టి తను మాత్రం అన్నం కోసం అల్లాడే వాడు అన్నదాత. సాంప్రదాయ పంటలను, కూరగాయలను పండిస్తూ… రైతులు లాభాల కోసం ఎదురుచూసే రోజులు పోయాయి. కొంత మంది రైతులు ముందుగానే మార్కెట్ ను అధ్యయనం చేసి అందుకు తగిన విధంగా వ్యవసాయాన్ని చేస్తూ… లాభాలను ఆర్జిస్తున్నారు. మరో వైపు పంట సాగును సేంద్రియ పద్ధతి తో పాటు… ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ అన్నదాత ఆర్ధికంగా ఎదుగుతున్నాడు.. తాజా గా బీహార్ కు చెందిన ఓ రైతు కూడా సరిగ్గా మార్కెట్ కు ఏమి కావాలో తెలుసుకుని అదే పద్ధతిలో వ్యవసాయం చస్తున్నాడు. అతను పండించే పంటకు ఏకంగా కిలో రూ. లక్ష ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరి రైతును కిలోతోనే లక్షాధికారి చేస్తోన్న ఆ పంట ఏమిటి..? ఇక్కడ పండిస్తారో తెసుకుందాం…?
బీహార్లోని ఔరంగాబాద్ లో వున్నా నవీనగర్ బ్లాక్ కరండిహ్ గ్రామానికి చెందిన ఆమ్రేష్ డిఫరెంట్ పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. చదివింది ఇంటర్ అయితే అమ్రేష్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకున్నాడు.దీంతో ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్ ఉన్నపంట తన పొలంలో పండుతుందని అంచనా వేసుకున్నాడు.దీంతో ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్ ఉన్న హాప్ షూట్స్ అనే ఓ రకమైన మూలికల జాతికి చెందిన కూరగాయను పండిస్తున్నాడు. అయితే మొదట్లో అమ్రేష్ ఈ పంటను వేసినప్పుడు చూసిన వారంతా పిచ్చి పని చేస్తున్నాడని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసే సరికి అవాక్కయ్యారు.
ఔషధాల తయారీలో వాడే ఈ మొక్కకు మంచి ధర పలుకుతుంది
హాప్ షూట్స్ మొక్క ఆకులు, పువ్వులు, కాయలను యాంటీ బయోటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉన్నది. ఈ మొక్క తో బీర్ తయారు చేస్తారు. ముఖ్యంగా టీబీ చికిత్సకు ఉపయోగించే ఔషధాల్లో ఉపయోగిస్తారు.అందుకనే ఈ పంటకు ఖరీదు చాలా ఎక్కువ. ఈ పంటను తనకు సాగు చేయమని వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ సజెస్ట్ చేసారని అమ్రేష్ చెప్పాడు. ఇప్పుడు ఈ పంట పెరుగుదల ఆ పరిసర ప్రాంతాల్లో విజయవంతం కావడంతో గ్రామంలోని మిగతా రైతులు కూడా హాప్ షూట్స్ ను పెంచడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.